బెంగళూరు బైక్ టాక్సీ నిషేధంతో ఉద్యోగులు, సామాన్యులు ఇప్పుడు ప్రయాణాల ఖర్చుతో పోరాటం చేస్తున్నారు. జూన్ 16, 2025 నుంచి సిధ్దరామయ్య సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ టాక్సీలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో రోజూ లక్షలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు బైక్ టాక్సీలపై ఆధారపడుతూ వుంటారు. బెంగుళూరు ట్రాఫిక్ తో సతమతమవుతూ..నిషేధానికి ముందు తక్కువ ఖర్చుతో కార్యాలయాలకు చేరుకునే వారు. అయితే ఇప్పుడు బైక్ ట్యాక్సీల నిషేధంతో వీరి అవస్థలు చెప్పలేనివిగా ఉన్నాయి. పోటీ లేకపోవడంతో ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఆటో రిక్షా ఖర్చు రూ. 100 నుంచి ఏకంగా రూ. 700 రోజుకు పెరిగింది. ప్రతి రోజు రూ. 700 అంటే దేశ పౌరుల సగటు ఆదాయంతో సమానమని పలువురు వాపోతున్నారు.

రోజు రాను పోనూ ఖర్చులు రూ. 1400 అయితే సామాన్యుడు బెంగుళూరు నగరంలో ఎలా బతకాలని ఆవేదనపడుతున్నారు. ఆ లెక్కన నెలకు ఆటో ఛార్జీల ఖర్చే రూ.15 వేలు అయితే ఎలా బతకాలి అని మండిపడుతున్నారు. బైక్ టాక్సీ లేకపోవడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని మరో యూజర్ ట్వీట్ చేశారు. పోటీ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే రాపిడో యాప్ బైక్ రైడ్ బుకింగ్‌ను నిలిపివేయడంతో కస్టమర్లు కొత్త దారిని ఎంచుకుంటున్నారు. కొత్తగా బైక్ పార్సిల్ అనే ఎంపికను ఉపయోగించి కొందరు తమను తాము పార్సెల్‌లుగా బుక్ చేసుకుని బైక్ మీద ప్రయాణిస్తున్నారు. బైక్ టాక్సీ నిషేధం మొదలైంది. కానీ Rapido యాప్ ఓనర్ తెలివిగా Bike Parcel ఆప్షన్ ఇచ్చాడు. రైడ్ బుక్ చేయలేకపోతే, పార్సెల్‌గా మారి ఆఫీసుకు వెళ్లిపోండని యూజర్ సరదాగా ట్వీట్ చేస్తున్నారు.
ప్రైవేట్ బైక్‌లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్ట విరుద్ధమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అందుకే యాప్ ఆధారిత బైక్ రైడింగ్ సేవలైన Rapido, Ola Bike మొదలైన వాటిని నిషేధించింది. దీనిని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ప్రభుత్వం బైక్ టాక్సీలపై నియమావళి రూపొందించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర పక్షాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జూన్ 24 కు వాయిదా వేసింది.
బెంగుళూరు నగరంలో తక్కువ ధరకే ప్రయాణం చేయాలనుకునే ఉద్యోగులకు ఇప్పుడు జేబులు చిల్లులు పడుతున్నాయి. వారి ప్రయాణ ఖర్చు విపరీతంగా పెరిగింది. దానికి తోడు సొంత వాహనాలతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఆటో డ్రైవర్ల ఇష్టం వచ్చినట్లుగా రేట్లు నిర్ణయిస్తున్నారు. ఇది ప్రజాగ్రహానికి కారణం అవుతోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications