మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం (CLSS) మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. రూ.6 లక్షల నుండి రూ.18 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకాన్ని 2017 మే నెలలో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. గడువు మార్చి 31, 2020తో ముగిసింది. అయితే ఇప్పుడు ఈ స్కీం గడువును మార్చి 31, 2021 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా గతంలో 3.3 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. అదనంగా 2.5 లక్షల మధ్య ఆదాయ కుటుంబాలు చేరనున్నాయి. ఈ పథకం పొడిగింపు వల్ల కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు స్టీల్, సిమెంట్ మెరుగుపడి, తక్షణమే డిమాండ్ పెరుగుతుందన్నారు. దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల మందికి ప్రయోజనం ఉంటుందన్నారు. హౌసింగ్ సెక్టార్‌కు రూ.70 కోట్ల పెట్టుబడులు రావడానికి, ఉద్యోగాలు రావడానికి ఉపయోగపడుతుందన్నారు.

ఇతర అంశాల గురించి మాట్లాడుతూ.. ముద్ర పథకం కింద రూ.50వేల లోపు శిశు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రాయితీ ఇస్తామని తెలిపారు. మారటోరియం అనంతరం ముద్ర రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుందన్నారు. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు రూ.6వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.
డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి మరిన్ని రాయితీలు ఇస్తామన్నారు. త్వరలో జాతీయ వేతన ఫ్లోర్ విధానం తీసుకొస్తామన్నారు. రెండున్నర కోట్ల మంది రైతులకు కొత్తగా కిసాన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. వీరికి రూ.2 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇస్తామన్నారు. కిసాన్ క్రెడిట్‌లేని రెండున్నర కోట్ల మంది రైతులకు ఈ పథకంవర్తిస్తుందన్నారు. పశుపోషకులు, మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు.


Click it and Unblock the Notifications