హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో అమలు చేయనున్న రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

రూ.5,100 మంజూరు
2019-20 వార్షిక బడ్జెట్లో రైతుబంధు కోసం 12,862 కోట్లు కేటాయించారు. ఇందులో ఖరీఫ్ సీజన్లో రూ.6,862 కోట్లు మంజూరు చేయగా, రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. తాజాగా, రబీలో అందించేందుకు రూ.5,100 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ వివరాలు వచ్చాక అకౌంట్లలోకి రైతు బంధు నిధి
నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందిస్తుంది. ఆ వివరాలు అందించిన వెంటనే ఆర్థికశాఖ ఆ నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతుబంధు నిధిని జమ చేస్తుంది.

అలా ఐతే రూ.3500లే మిగులు
ఇదిలా ఉండగా, గత జూన్ - సెప్టెంబర్ ఖరీఫ్ సీజన్‌కు గాను రైతులకు మరో రూ.1,600 కోట్లు ఇవ్వవలసి ఉంది. వాటిని ముందుగా రైతుల ఖాతాలలో వేస్తే రూ.5,100 కోట్లలో రూ.3,500 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ బకాయి మొత్తాన్ని ఇప్పుడే ఇస్తారా లేక రబీకి తొలుత వేసి ఆ తర్వాత వేస్తారా తెలియాల్సి ఉంది.

నిధిని ఈ పద్ధతిలో వేస్తారా?
ఖరీఫ్ సీజన్‌కు గాను 10 ఎకరాల లోపు భూమి గల రైతుల అకౌంట్లలో ఎకరానికి రూ.5వేల చొప్పున జమ చేశారు. 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారికి ఇంకా జమ కాలేదు. ఇప్పుడు కూడా తొలుత ఎకరం, ఆ తర్వాత 2 ఎకరాలు... ఇలా పెంచుకుంటూ తక్కువ భూమి ఉన్న వారి ఖాతాలో ముందు జమ చేసే విధానంలో వ్యవసాయ శాఖ వెళ్లే అవకాశముంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications