ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడానికి ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అలాగే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లను ప్రారంభించింది. దీని కింద 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఇతర బ్యాంకులో అకౌంట్ ఉన్న ఎవరికైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా బ్యాంకులతో అనుబంధం ఉండి కొన్ని నిబంధనలతో అలాగే అవసరమైన ఆమోదాలతో ఇవ్వడానికి రెడీగా ఉన్న ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అందిస్తున్నాయి.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎవరు తీసుకోవచ్చు: ప్రస్తుతం PMJJBY 18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. SBI, పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఇతర బ్యాంకులో బ్యాంకు అకౌంట్ ఉండి ఆటో-డెబిట్‌లో ఆన్ లేదా యాక్టివేట్ చేసి ఈ పాలసీలోకి కొనసాగవచ్చు. అయితే బ్యాంకు అకౌంట్ KYC కోసం ప్రాథమికంగా కావాల్సింది ఆధార్ కార్డు. 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ జూన్ 1 నుండి మే 31 వరకు అంటే 12 నెలల కాలనికి వాలిడిటీ ఉంటుంది ఇంకా కావాలనుకుంటే రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు కవరేజీ హామీ ఇస్తుంది.
మే 31లోపు రూ.436 ఆటో డెబిట్ ఎలా ఆపాలంటే : ఈ పాలసీ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం ద్వారా మరణిస్తే రూ. 2 లక్షల వరకు రిస్క్ కవరేజీని అందిస్తుంది. అన్యువల్ ప్రీమియం రూ. 436, అయితే సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ఆధారంగా కూడా ఈ మొత్తం మారుతుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం మే 31న లేదా అంతకు ముందు బ్యాంక్ అకౌంట్ నుండి ఆటో-డెబిట్ ఆన్ చేసి ఉండాలి.
మీరు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వొద్దనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నుండి అన్యువల్ ఆటో-డెబిటింగ్ ప్రాసెస్ ఆఫ్ చేసే అప్షన్ కూడా ఉంది. దీని కోసం మీరు మీ అకౌంట్ PMJJBY ప్రోగ్రామ్‌కు లింక్ చేసిన బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలి. మీరు అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి PMJJBY ప్రీమియం పేమెంట్ ఆపేయమని అడగవచ్చు. అంతేకాదు టైంకి పేమెంట్ చేయకపోతే మీ పాలసీ ఆటోమేటిక్'గా రద్దు అవుతుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో అవసరమైన మొత్తం లేకపోతే కూడా ప్రీమియం ఆటో-డెబిట్ సాధ్యం కాదు. ఇంకా ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్యాన్సల్ అవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications