ఏజీఆర్ విషయంలో సుప్రీమ్ కోర్ట్ తీర్పు నేపథ్యంలో వోడాఫోన్ - ఐడియా సంక్షోభం మరింత అధికమైంది. ప్రభుత్వానికి ఈ టెలికాం కంపెనీ సుమారు రూ 53,000 కోట్ల మేరకు బకాయి పడింది. బకాయిలను వీలైనంత త్వరగా వోడాఫోన్ - ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ కంపెనీ వద్ద నిధులు లేవు సరికదా ... తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. వోడాఫోన్ - ఐడియా మూత పడే అవకాశాలను కూడా కొట్టివేయలేమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వోడాఫోన్ - ఐడియా లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నిండా మునిగే పరిస్థితి నెలకొంది. వోడాఫోన్ - ఐడియా కంపెనీ సమయానికి నిధులను సమకూర్చుకోలేక పోతే, ఇక దాని ఆపరేషన్స్ సందిగ్ధంలో పడిపోతాయి. అప్పుడు, ఆ కంపెనీ లో తమ పెట్టుబడులు కూడా వృధా ఐ పోతాయని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ బుక్స్ లో వోడాఫోన్ - ఐడియా లో పెట్టిన పెట్టుబడులను రైట్ ఆఫ్ చేసుకుంటున్నాయి.

ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కు షాక్...
మొత్తంగా వోడాఫోన్ - ఐడియా కంపెనీ లో అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కలిసి దాదాపు రూ 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అనే మ్యూచువల్ ఫండ్ సంస్థ పెట్టింది. ఈ ఒక్క సంస్థనే రూ 2074 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టి షేర్లు కొనుగోలు చేసింది. అందుకే, అందరికంటే అధికంగా ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఆందోళన చెందుతోంది. అయితే, ఇక ఎలాగు చేసేదేమి లేదు కాబట్టి.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే తన పూర్తి పెట్టుబడులను ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ రైట్ ఆఫ్ చేసుకుంది. అంటే, ఇక ఆ షేర్ల నుంచి ఎలాంటి రాబడిని ఆశించటం లేదు.

రూ లక్ష కోట్ల అప్పు...
ఇండియా లో రిలయన్స్ జియోతో నెలకొన్న పోటీ లో భాగంగా వోడాఫోన్ - ఐడియా కలిసిపోయాయి. ఈ కలయికతో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగినా... ఎక్కువకాలం ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ప్రస్తుతం జియో నే ఇండియా లో అతి పెద్ద టెలికాం కంపెనీ. ఈ పోటీలో నిలదొక్కుకునేందుకు వోడాఫోన్ - ఐడియా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసింది. 2019 మార్చి నాటికి ఈ కంపెనీ మొత్తం అప్పులు రూ 1 లక్ష కోట్ల కంటే అధికం. మరో వైపు ఏ జీ ఆర్ రూపంలో ఈ కంపెనీ రూ 53,000 కోట్ల బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కంపెనీ భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

ఇప్పుడు ఏం చేయాలి..
సహజంగా ఒక కంపెనీ మూతపడే అవకాశం ఉన్న సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనలిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వోడాఫోన్ - ఐడియా కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఒక్క శుక్రవారం రోజునే ఈ కంపెనీ షేర్లు 39% పతనం అయ్యాయి. సాక్షాత్తు కంపెనీ అధినేత కుమార మంగళం బిర్లా కూడా కంపెనీ మూతపడే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు తొందరపడి షేర్లు విక్రయించకూడని అనలిస్టులు పేర్కొంటున్నారు. అలాగైతే పూర్తిగా నష్టపోతారని చెబుతున్నారు. దానికంటే... వేచి చూస్తేనే బెటర్ అని సూచిస్తున్నారు. ఎందుకంటే, కంపెనీ నిలబడేందుకు చర్యలు తీసుకోవచ్చు, లేదా వేరొక మార్గం లభించవచ్చు. అప్పుడు కంపెనీ షేర్లు మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సో, మీరు కూడా ఈ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే... తగిన నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications