ఒక ఐటీ ప్రొఫెషనల్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే దశలో నిలబడి ఉన్నాడు. రూ. 33.5 లక్షల వార్షిక వేతనం (LPA)తో ఇంటి నుంచి పనిచేసే (WFH) సౌకర్యం ఉన్న ఉద్యోగాన్ని వదలి.. రూ. 45.5 LPA జీతంతో బెంగళూరులో ఆఫీస్‌కు వెళ్లే ఆఫర్ స్వీకరించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు Redditలో పోస్టు చేశాడు. అతని ఈ వ్యక్తిగత సంక్లిష్టత వేలాది మంది వినియోగదారుల మధ్య వేడెక్కిన చర్చకు దారితీసింది. డబ్బు ముఖ్యమా పని జీవితం సమతుల్యమా? లేక భవిష్యత్ అవకాశాలా.. ఏది ముఖ్యం అనే ప్రశ్న చుట్టూ ఈ చర్చ తిరిగింది.
6.5 సంవత్సరాల అనుభవం ఉన్న డేటా ఇంజనీర్ గా తన ప్రస్తుత పరిస్థితిని వివరించిన ఉద్యోగి.. ప్రస్తుతం తనకు రూ. 33.5 LPA CTCతో రిమోట్‌గా పని చేసే అవకాశం ఉంది, ఇది శాశ్వత WFH కాకపోయినా, ప్రస్తుతం ఉన్న చాలామంది ప్రాజెక్టులు రిమోట్ మోడ్‌లోనే నడుస్తున్నాయని చెప్పాడు. క్లయింట్ లేదా సంస్థ విధానం మారితే.. భవిష్యత్తులో హైదరాబాద్‌కు మారాల్సిన అవకాశం కూడా ఉందని చెప్పాడు. మరోవైపు, బెంగళూరులో ఉన్న కొత్త ఆఫర్ రూ. 45.5 LPA జీతాన్ని ఇస్తున్నప్పటికీ అది పూర్తిగా WFO లేదా హైబ్రిడ్ లేదా WFHకు మారవచ్చు. ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

తన పోస్టులో ఉద్యోగి ప్రస్తుత కంపెనీ పని జీవిత సమతుల్యత (WLB) అద్భుతంగా ఉందని, టీమ్ వాతావరణం స్నేహపూర్వకంగా ఉందని పేర్కొన్నాడు. అయితే, పని నాణ్యత సంతృప్తి కలిగించడం లేదని, సవాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే మెరుగైన అవకాశాలు, జీతం కోసం మార్పు పై ఆలోచిస్తున్నానని వివరించాడు. ఇది తెలివైన నిర్ణయం అవుతుందా అని ప్రశ్నిస్తూ నెటిజన్ల అభిప్రాయాలను కోరాడు.
ఈ ప్రశ్న ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. చాలామంది వ్యక్తిగత ప్రాధాన్యతలు, భవిష్యత్ లక్ష్యాలు, నగర జీవనశైలి, పని ఒత్తిడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంతమంది వినియోగదారులు WFH ఉద్యోగాన్ని ఎప్పటికీ వదులుకోరని స్పష్టంగా చెప్పారు. ఇది మొత్తం నీ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. నాకు అయితే WFH ఏ రోజైనా ప్రాధాన్యమని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు రూ. 45.5 LPA ప్యాకేజీ బెంగళూరులో పెద్ద అవకాశాలకు ద్వారం కావచ్చని, దీన్ని స్వీకరించడం సరికైన నిర్ణయం అవుతుందని ప్రోత్సహించారు.
అయితే, కొందరి కామెంట్లు బెంగళూరులోని జీవనశైలి సమస్యలపై దృష్టిపెట్టాయి. బెంగళూరులో ట్రాఫిక్ భయంకర స్థాయిలో ఉంది, ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి పరిస్థితిలో WFH అత్యుత్తమని ఒకరు పేర్కొన్నారు. కొంతమంది మాత్రం కెరీర్ వృద్ధిని ముఖ్యం అని భావించారు. చాలా సౌకర్యంలో ఉండటం ఎదుగుదలను ఆపేస్తుంది. కొన్నిసార్లు ప్రమాదం తీసుకోవాలని ఒకరు పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications