MP farmer Rs.3 Salary Story: దేశానికి రైతు వెన్నెముక అనేది నేడు పాత సామెతగా మారిపోయింది. దైశంలో రైతుగా పుట్టినందుకు అడగడుగునా కష్టాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం కానరావడం లేదు. అప్పులతో వ్యవసాయం చేస్తున్నాడు. పంటలను పండించిన తర్వాత దళారుల చేతుల్లో చిక్కి నలిగిపోతున్నాడు. పంట సాగు చేస్తే తక్కువ పంట దిగుబడి , వ్యవసాయోత్పత్తుల హెచ్చుతగ్గుల ధరలు , అధిక ఇన్‌పుట్ ఖర్చులు , రుణభారం, రుణాలు, మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల రైతులను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇక ఉద్యోగులు లక్షల్లో జీతాలు తీసుకుంటుంటే మాత్రం రైతులు జీతాలు రూపాయిల్లో ఉన్నాయనే చెప్పేందుకు ఓ ఘటన ఇప్పుడు సాక్ష్యంగా నిలుస్తోంది.
సంవత్సరానికి రూ.3 ఆదాయం తీసుకున్న ఓ మధ్యప్రదేశ్ రైతు కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మన దేశంలో రూ.3తో ఏమి కొనగలమో మనందరికీ తెలుసు. దానికి ఒక్క కప్పు చాయ్ కూడా రాదు. అలాంటిది మధ్యప్రదేశ్‌లోని ఒక రైతుకు జారీ అయిన అధికారిక ఆదాయ ధృవీకరణ పత్రంలో చూస్తే రైతుకు ఇంత ఆదాయమా అని ఆశ్చర్యపోతారు. ఆ పత్రంలో రైతు సంవత్సర ఆదాయం కేవలం రూ.3 అని చూపించారు. ఇది నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పాటుగా ఆగ్రహానికి కూడా కారణమైంది.

సత్నా జిల్లాలోని నయాగావ్ గ్రామానికి చెందిన రాంస్వరూప్ అనే 45 ఏళ్ల రైతుకు జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రంలో ఈ వివరాలను అధికారులు పొందు పరిచారు. జూలై 22 వ తేదీన తహసీల్దార్ సౌరభ్ ద్వివేది ఈ ఆదాయ ధృవీకరణ పత్రంపై సంతకం చేశారు. ఆ పత్రం ప్రకారం రాంస్వరూప్ వార్షిక ఆదాయం రూ.3 మాత్రమే. అంటే నెలకు సగటున 25 పైసలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లుగా తెలిపారు. ఈ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
నెటిజన్లు మీమ్స్, జోకులతో నింపేసారు. కొంతమంది దీన్ని గ్రామీణ భారతదేశం వాస్తవ పరిస్థితికి నిదర్శనంగా భావించగా మరికొంతమంది ఇది కేవలం ఒక క్లరికల్ పొరపాటు అయి ఉండవచ్చని తెలిపారు. అయితే దేశంలో రైతులు పడుతున్న కష్టాలను ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనేది మాత్రం నిజమని చాలామంది నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
అయితే ఈ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. జూలై 25న అధికారులు రాంస్వరూప్‌కి మరో కొత్త ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. ఈసారి అందులో ఆయన ఆదాయాన్ని సవరించి రూ.30 వేలు వార్షికంగా చూపించారు. అంటే నెలకు 2,500 గా పేర్కొన్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ ద్వివేది మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక క్లరికల్ తప్పిదం. మేము వెంటనే సరిచేశామని చెప్పారు.
ఈ అంశం ఎంపీలో రాజకీయంగా కూడా దుమారం రేపింది. వైరల్ అయిన రూ.3 ఆదాయ పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికార బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగింది.ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాలనలో దేశంలోనే అత్యంత పేద రైతును కనుగొన్నామంటూ విమర్శలు గుప్పించింది. ఆ రైతు ఆదాయం సంవత్సరానికి కేవలం మూడు రూపాయలు మాత్రమే అంటూ వ్యంగ్యం విసిరింది. ఇప్పుడు కుర్చీ కూడా కమిషన్ తింటోందని ఎద్దేవా చేసింది. ఏదేమైనా అధికారులు చేసిన చిన్న పొరపాటు రైతు కష్టాల కడలి జీవితాన్ని మరోసారి తెరపై ఆవిష్కరించింది ఈ ఘటన అని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications