రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో కొన్ని ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎదురుచూస్తున్న పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నీతి యోజన పథకం (PM కిసాన్) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తారు. ఈ మొత్తం ఒక వాయిదాలో కాకుండా 3 వాయిదాలలో అంటే రూ.2000 చొప్పున 3 వాయిదాలలో జమచేస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా రైతు బ్యాంకు అకౌంట్లో 2వేలు జమ చేస్తుంది.
పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 విడతలు అందించారు. ఇప్పుడు 19వ విడత ఎప్పుడు వస్తుంది అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

19వ విడత ఎప్పుడు అంటే
2024 అక్టోబర్లో 18వ విడత రైతు బ్యాంకు అకౌంట్లో జమ చేసారు. సాధారణంగా ఈ మొత్తం ప్రతి 4 నెలలకు ఒకసారి జమ చేస్తారు. ఈ నేపథ్యంలో 19వ విడత ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ గతేడాది కూడా ఇదే తేదీన 16వ విడత రిలీజ్ చేసారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 28న 19వ భాగం విడుదల కావచ్చని భావిస్తున్నారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నీతి యోజన పథకంలో చేరడానికి అర్హత
ఈ పథకం రైతులందరికీ ప్రయోజనం కలిగించదు. సరైన అర్హత ప్రమాణాలు ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందుతారు. అంటే కుటుంబ సభ్యులలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు PM కిసాన్ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు కారు. పిఎం కిసాన్ పథకం కింద కుటుంబానికి ఒక్కరు మాత్రమే ఆర్థిక సహాయం పొందవచ్చు. రైతులు ప్రతి విడత పొందాలంటే e-KYC ప్రక్రియను ఫినిష్ చేయాలి. పీఎం కిసాన్ పథకం నుంచి లబ్ధి పొందేందుకు ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. మీరు పథకంకి అర్హులో కాదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ పథకానికి అర్హత ఎలా చెక్ చేయాలంటే ?
1. ముందుగా PM కిసాన్ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2. "లబ్దిదారుల లిస్ట్" పేజీకి వెళ్ళాలి.
3. మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ ఇంకా గ్రామ వివరాలను ఎంటర్ చేయండి.
4.మీ పేరు చేర్చబడిందో లేదో చూడటానికి "get report"పై క్లిక్ చేయండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications