తల్లి పేరు మీద FD పెడితే రూ. 20 లక్షల ట్యాక్స్ నోటీసా? మరి FDలు సేఫ్ ఏ నా
భారతదేశంలో ఒక 61 ఏళ్ల గృహిణి తన మెయిల్‌బాక్స్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్! ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు వచ్చింది. అది కూడా "రూ. 20 లక్షల డిపాజిట్" గురించి! కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆమె ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలేదు. అసలు విషయం ఏమిటంటే, ఆమె కుమార్తె కుటుంబ సౌకర్యం కోసం "జాయింట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)" పెట్టి, అమ్మ పేరును కూడా జత చేసింది. మంచి పనికే పెట్టిన FD, కానీ అది ఒక పెద్ద కాంప్లైయెన్స్ తలనొప్పిగా మారింది.

ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. భారతదేశంలో 2.5 బిలియన్లకుపైగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి కుటుంబంలోనూ జాయింట్ FDలు కనిపిస్తాయి. వీటిని పెట్టడానికి కూడా సరైన కారణాలే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఎవరైనా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. సేఫ్టీ, కన్వీనియన్స్ కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం ఎప్పుడైనా ఏదైనా అనర్థం జరిగితే వారసత్వం సులభంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇవన్నీ సేఫ్ ఆప్షన్‌లాగా అనిపించినా, కొన్నిసార్లు ట్యాక్స్ వ్యవస్థలో ఇవే బూమరాంగ్ అవుతాయి.
ఎందుకంటే Rule 114E ప్రకారం బ్యాంకులు రూ.10 లక్షలకు మించిన డిపాజిట్లన్నీ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేయాలి. జాయింట్ FD అయితే, అందులో ఉన్న ప్రతి PAN మీదా ఆ మొత్తం రిపోర్ట్ అవుతుంది. అంటే, ఒక FDలో రూ .20 లక్షలు పెడితే, అదే మొత్తం అమ్మ PAN మీదా, కూతురు PAN మీదా రెండింటిలోనూ Annual Information Statement (AIS)లో కనిపిస్తుంది. సిస్టమ్ దాన్ని డూప్లికేట్ ఇన్కమ్‌గా భావించి ఆటోమేటిక్‌గా నోటీసు పంపుతుంది. ఇక్కడ ఎవరు డబ్బు పెట్టారు అనేది ముఖ్యం కాదు, FD ఎవరిపేరుతో ఉంది? అన్నదే ముఖ్యం అవుతుంది.
AIS అంటే ఏంటి:
AIS అంటే Annual Information Statement, కానీ దీనిని సింపుల్‌గా "మన డబ్బు ఎక్కడెక్కడ ఉపయోగించామో చూపించే పెద్ద లిస్ట్" అని అనుకోవచ్చు. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మనకోసం తయారు చేసే రిపోర్ట్. మనం బ్యాంకులో FD పెట్టినా, షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, రెంట్ రిసీవ్ చేసినా లేదా మన అకౌంట్‌లో పెద్ద మొత్తం డిపాజిట్ అయినా ఇవన్నీ ఆటోమేటిక్‌గా IT డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ అవుతాయి. ఆ తర్వాత అవి అన్నీ ఒకే చోట కూర్చి మన AISలో చూపిస్తారు. అంటే, మీ మీద ఎన్ని లావాదేవీలు రిపోర్ట్ అయ్యాయో, ఎక్కడ ఎవరైనా TDS కట్ చేశారో, మీరు చెప్పకపోయినా కూడా, సిస్టమ్‌కి తెలిసే అవకాశం ఉంటుంది. ITR ఫైల్ చేసేముందు AIS చెక్ చేస్తే, తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. లేకపోతే, ఒకే డిపాజిట్ రెండు సార్లు రిపోర్ట్ అయిందని సిస్టమ్ డూప్లికేట్‌గా ఫ్లాగ్ చేసి నోటీసు పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి AIS అనేది అసలు మన ఫైనాన్షియల్ యాక్టివిటీలకు ఒక మిర్రర్ లాంటిది. మీరు డబ్బు ఎక్కడ కదిపినా, దాని నీడ ఇక్కడ కనబడుతుందని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇలాంటి నోటీసులు పూర్తిగా తప్పించుకోవచ్చా? నిజం చెప్పాలంటే, కష్టమే. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ ఆటోమేషన్. కానీ కొన్ని సింపుల్ స్టెప్స్ తీసుకుంటే టెన్షన్ తగ్గించుకోవచ్చు. ITR ఫైల్ చేసే ముందు మీ AIS తప్పనిసరిగా చెక్ చేయాలి. అందులో డూప్లికేట్ లేదా తప్పుగా ఉన్న ఎంట్రీలు కనిపిస్తే "మరొక PAN కి చెందినది" అని ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. అదనంగా, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, గిఫ్ట్ డీడ్స్, ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్స్ వంటి డాక్యుమెంట్స్ సేఫ్‌గా ఉంచుకోవాలి. నోటీసు వస్తే ఆలస్యం చేయకుండా ఆన్లైన్‌లోనే సమాధానం ఇవ్వాలి.
ఈ స్టెప్స్ ఫాలో కాకపోతే పరిస్థితి సీరియస్ అవుతుంది. డిమాండ్ నోటీసు రావచ్చు, పెనాల్టీలు పడవచ్చు, రీఅసెస్‌మెంట్ (Sec 148A)కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ట్యాక్స్ నోటీసు అంటే ఎప్పుడూ చెడు వార్త కాదు. చాలామంది నోటీసు అంటే వెంటనే భయపడిపోతారు. కానీ అసలు అది "మీరు క్లారిటీ ఇవ్వండి" అని సిస్టమ్ అడిగే రిక్వెస్ట్ మాత్రమే. మీ రికార్డ్స్ క్లీన్‌గా ఉంటే, ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే కేసు క్లోజ్ అయిపోతుంది.
చివరగా చెప్పాలంటే, కుటుంబ సౌకర్యం కోసం తల్లిదండ్రుల పేరుతో FDలు పెట్టడం సర్వసాధారణం. కానీ సిస్టమ్ ఆటోమేటెడ్ అయిన ఈ రోజుల్లో, ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకే ప్రశ్న ఈ రిస్క్ తెలుసుకున్నాక కూడా మీరు తల్లిదండ్రుల పేరుతో FD పెడతారా? లేక కొత్త ఆప్షన్లు వెతుకుతారా?


Click it and Unblock the Notifications