కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి గతంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక నిపుణులు మరో రూ.10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అవసరమని చెబుతుండగా, ప్రధాని మోడీ అనూహ్యంగా నిన్న రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. నిర్మలా సీతారామన్ కేటాయింపుల గురించి వెల్లడించనున్నారు.

రాష్ట్రాలకు చేరితే ప్రయోజనం
లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతోంది. ఆర్థిక కార్యకలాపాల్లేక వ్యాపారుల చేతిలో డబ్బులు లేని పరిస్థితి. ఉద్యోగులకు వేతనాల్లో కోత విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ మెగా ప్యాకేజీ ప్రకటించారు. ఇది ఎంతో ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ ప్యాకేజీలో కొంత మొత్తం రాష్ట్రాలకు చేరితే మరింత ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు ఎకానమీకి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

ఎకానమీకి ప్రయోజనం
పంజాబ్ జలంధర్‌లోని పారిశ్రామికవాడలోని కంపెనీలతో ఓసారి మాట్లాడాలని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రధాని మోడీని కోరారు. జీఎస్టీ కంపన్సేషన్‌ను చెల్లించాలని ఏపీ, తెలంగాణ, కేరళ వంటి ఎన్నో రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు లేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా చితికిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్రాలకు చేరితేనే ఎకానమీకి లాభమని చెబుతున్నారు.

పరిహారం ఇందులో చేర్చవచ్చు
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్‌బీఎం కింద మరిన్ని రుణాలు తీసుకునే అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని సడలించే ముందు వ్యవసాయ మార్కెటింగ్, లేబర్ చట్టాలు, పట్టణాభివృద్ధి, విద్యుత్ పంపిణీ వంటి విషయాల్లో రాష్ట్రాలకు షరతులు విధిస్తారనే భావిస్తున్నారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఇందులో చేర్చవచ్చునని చెబుతున్నారు.

పన్ను రాయితీలు
పరిశ్రమలకు పెద్ద ఎత్తున పన్ను, ఇతర రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్బీఐ వివిధ వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రుణాలకు సంబంధించి కూడా పలు రాయితీలు ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.

ఇవి పెంచే అవకాశం
రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. భారీ ఎత్తున నగదు బదలీలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఉపాధి హామీ వేతనాలను మరింత పెంచడం, వ్యవస్య పనులను పథకం పరిధిలోకి తీసుకు రావడం, నిత్యావసరాలను ఉచితంగా మరిన్ని రోజులు సరఫరా చేసే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జన్ ధన్ యోజన కింద మహిళా లబ్ధిదారులకు మరింత మొత్తాన్ని బదలీ చేసే అవకాశముంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications