నెలకు రూ.2 లక్షల జీతం..అప్పుల్లేవు.. అయినా బతకడం కష్టంగా ఉందంటున్న బెంగళూరు టెకీ..

నెలకు ఏకంగా రూ. 2 లక్షల ఆదాయం సంపాదిస్తూ, ఎలాంటి అప్పులు లేకపోయినా తాను ఇంకా పేదవాడిలాగే భావిస్తున్నానని బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల యువకుడు రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగితాల మీద తన ఆర్థిక పరిస్థితి ఎంతో సురక్షితంగా కనిపిస్తున్నప్పటికీ.. నిరంతరం డబ్బు గురించిన ఆందోళన తనను వెంటాడుతోందని.. తాను సాధించిన విజయం పట్ల సంతృప్తి చెందలేకపోతున్నానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

తన గత ఆర్థిక నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. 21 ఏళ్ల వయస్సులో తనకు ఉద్యోగం వచ్చే వరకు తమ కుటుంబ నెలవారీ రాబడి రూ. 6 వేల నుండి 7 వేలు దాటలేదని, తమ కుటుంబం 10x10 అడుగుల ఒక చిన్న గదిలో నివసించేదని అతను తెలిపాడు. 2021లో ఉద్యోగంలో చేరిన వెంటనే తల్లిదండ్రులను ఉద్యోగాల నుండి రిటైర్ చేయించి, సొంత ఊరిలో ఒక 2BHK ఇంట్లోకి మార్చాడు.

Bengaluru Techie 2 Lakh Salary Salary Stress Personal Finance Financial Stress Bengaluru IT Employee Tech Jobs India High Salary Money Management Cost of Living Bengaluru Cost of Living Employee Lifestyle Viral Post India Salary News Business News 2

ప్రస్తుతం అతను ప్రతి నెలా:

మ్యూచువల్ ఫండ్లు: రూ. 30,000
ఎఫ్‌డీ/ఆర్‌డీలు: రూ. 10,000
బంగారం పొదుపు: రూ. 10,000
తల్లిదండ్రుల ఖర్చులు: రూ. 15,000 - 20,000
సొంత జీవన వ్యయం (అద్దెతో కలిపి): రూ. 25,000 కేటాయిస్తున్నాడు.

ఇప్పటికే స్టాక్స్‌లో రూ. 4 లక్షలు, ఎఫ్‌డీలలో రూ. 2 లక్షలు, బంగారంలో రూ. 2.5 లక్షల పొదుపుతో పాటు బ్యాంక్ ఖాతాలో రూ. 6 లక్షల నగదు నిల్వలు ఉన్నాయి. కుటుంబానికి ఆరోగ్య బీమా, తనకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు.

Also Read

ఈ ఏడాదే వివాహం చేసుకోనుండటం (అంచనా వ్యయం రూ. 10 లక్షలు), పాత కారు, సొంత ఊరిలో స్థలం కొనాలనే ఆలోచనలు ఒకేసారి రావడం వల్ల అతను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. రూ. 750 కంటే ఎక్కువ విలువైన చొక్కా కొనాలన్నా భయపడే మానసిక స్థితి తనదని అతడు అంగీకరించాడు. సొంత ఊరిలో తక్కువ సంపాదిస్తూ.. రుణాలు తీసుకుని బైక్‌లు కొని సంతోషంగా జీవిస్తున్న ఆటో డ్రైవర్లు, కూలీలైన తన స్నేహితులను చూసినప్పుడు.. ఆర్థిక అవగాహనతో అప్పులు చేయని తాను ఎందుకు వెనుకబడిపోయానో అర్థం కావడం లేదని అతడు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు అతనికి అమూల్యమైన సలహాలు అందించారు. పేదరికంలో పెరగడం వల్ల కలిగే శాశ్వత మానసిక ప్రభావాలే (Scarcity Mindset) అతడి ప్రస్తుత అభద్రతకు అసలు కారణమని, గతంతో పోలిస్తే తాను ఎంత దూరం వచ్చాడో గుర్తుంచుకుని కృతజ్ఞతతో ఉండాలని నెటిజన్లు కోరారు. ఇది మధ్యతరగతి లేదా "శాండ్‌విచ్ జెనరేషన్" ఎదుర్కొనే సాధారణ సమస్య అని, మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఆస్తులు లేకపోవడమే ఈ పేదరిక భావనకు కారణమని ఒక వినియోగదారు వివరించారు. తొందరపడి స్మాల్ క్యాప్స్ లేదా ఇతర రిస్క్ ఉన్న పథకాల్లో పెట్టకుండా నిలకడగా పెట్టుబడులు కొనసాగిస్తే 30 ఏళ్ల వయస్సు నాటికి ఉన్నత స్థితికి చేరుకుంటారని ధైర్యం చెప్పారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+