న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోట్లను ప్రింట్ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోకసభకు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న అతిపెద్ద డినామినేషన్ ఇదే. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ రాతపూర్వకంగా లోకసభకు తెలిపారు. మార్చి 30, 2018 నాటికి 3,362 మిలియన్ల రూ.2000 కరెన్సీ నోట్ల చలామణిలో ఉన్నట్లు తెలిపారు. ఇది కరెన్సీ వాటాలో 3.27 శాతం కాగా, విలువ పరంగా 37.26 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 26, 2021 నాటికి 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు సర్క్యులేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఇది వ్యాల్యూమ్ పరంగా 2.01 శాతం కాగా, వ్యాల్యూపరంగా 17.78 శాతం. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ ఎలాంటి ఇండెంట్ వెళ్లలేదన్నారు.

2017-18లో కేవలం 111.507 మిలియన్ల నోట్లు ఉన్నాయని, 2018-19 నాటికి వీటిని 46.690 మిలియన్ల నోట్లకు తగ్గించామని తెలిపారు. 2019 ఏప్రిల్ నుండి రూ.2000 నోట్లను ప్రింట్ చేయడం లేదని తెలిపారు. 2016 నవంబర్ 8న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. ఆ తర్వాత రూ.2000 నోటును తీసుకు వచ్చారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications