న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు, పాకిస్తాన్ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రూ.లక్షల కోట్ల ఫేక్ కరెన్సీని అడ్డుకునేందుకు నాడు సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత రూ.2వేల నోటును భద్రతా ఫీచర్లతో తీసుకువచ్చారు. అయితే ఈ రూ.2 నోటును కాపీ కొట్టేందుకు సులభంగా ఉందని, భద్రత డొల్లతనమని తేలింది.

రూ.2,000 నోట్ల షాక్
రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లు వచ్చాయి. దీంతో రూ.2,000 ఫేక్ నోట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశంలో సగానికి పైగా నకిలీ రూ.2వేల నోట్లు ఉన్నాయని తాజా రికార్డులు చెబుతున్నాయి. నకిలీ కరెన్సీ, నల్లధనం, అవినీతిపై పోరాడేందుకు నోట్ల రద్దు ఉపయోగపడుతుందని చెప్పారు. నోట్ల రద్దు అనుకున్నంత మేర విజయం సాధించనప్పటికీ, మార్కెట్లో కరెన్సీ తగ్గుదల, డిజిటలైజేషన్ వంటి ఎన్నో రకాల ఫలితాలు మాత్రం కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

పట్టుబడిన నోట్లలో 56 శాతం ఫేక్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం నోట్ల రద్దు తర్వాత (2017, 2018) 56% రూ.2 వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయి. అత్యధిక నకిలీ కరెన్సీ పట్టుబడిన రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. తద్వారా రూ.2,000 నోట్లు కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో వచ్చినప్పటికీ దీనిని కూడా నకిలీ చేయడం సులభమేనని డేటా ద్వారా అర్థమవుతోందని చెబుతున్నారు.

రెండేళ్లలో పట్టుబడిన రూ.2,000 నోట్లు ఎంతంటే
2017లో పట్టుబడిన రూ.2,000 నోట్లలో 53.3 శాతం, 2018లో పట్టుబడిన నోట్లలో 61.1 శాతం ఫేక్ కరెన్సీ ఉంది. రెండేళ్లలో 56.31 శాతం ఫేక్ కరెన్సీ ఉంది. 2017, 2018లలో వరుసగా పట్టుబడిన రూ.500 నోట్లలో ఫేక్ కరెన్సీ 1.57 శాతం, 7.21 శాతం కాగా రెండేళ్లలో పట్టుబడింది 3.7 శాతం.

పాత నోట్లు కూడా..
రద్దయిన రూ.1,000, రూ.500 నోట్లు కూడా పట్టుబడ్డాయి. పాత రూ.1,000 నోట్లలో 2017లో 23.39 శాతం, 2018లో 15.3 శాతం పట్టుబడ్డాయి. రెండేళ్లలో 20.23 శాతం పట్టుకున్నారు. పాత రూ.500 నోట్లు 2017లో 18.29 శాతం, 2018లో 9.99 శాతం.. మొత్తం 15.02 శాతం పట్టుబడింది. ఇతర కరెన్సీ విషయానికి వస్తే రెండేళ్లలో 4.74 శాతం పట్టుబడింది.

ఫేక్ నోట్లు
2017లో పట్టుబడిన రూ.2,000 ఫేక్ కరెన్సీ కంటే 2018లో పట్టుబడిన ఫేక్ కరెన్సీనే ఎక్కువగా ఉండటం గమనార్హం. రెండేళ్లలో రూ.46.06 కోట్ల ఫేక్ కరెన్సీ బయటపడింది. 2017లో పట్టుబడిన ఫేక్ కరెన్సీలో రూ.2,000 నోట్లే రూ.28.10 కోట్లతో 53.30 శాతంగా ఉన్నాయి.

ఈ రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ పట్టుబడలేదు
NCRB డేటా ప్రకారం ఫేక్ రూ.2,000 నోట్లు పట్టుబడిన ప్రాంతాల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ పెరిగింది. జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం.. ఈ మూడు రాష్ట్రాలలో ఒక్క రూ.2,000 నోటు ఫేక్ కరెన్సీ పట్టుబడలేదు. ఇది 2018 డిసెంబర్ నాటికి. అండమాన్ నికోబర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో కూడా అంతే.

నోట్ల రద్దు తర్వాత సీజ్
నోట్ల రద్దు ప్రకటించిన పది రోజుల్లోనే కర్ణాటకలోని మైసూరులో 44 ఫేక్ రూ.2,000 నోట్లు పట్టుబడ్డాయట. ఆ తర్వాత హైదరాబాద్, మీరట్, బెంగళూరు, రాజ్‌కోట్‌లోను పట్టుబడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications