పశ్చిమాసియాలో మొదలైన యుధ్దం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు షిప్పులు ఆగిపోతున్నాయి. ఫలితంగా బ్యారల్ చమురు ధర ఏకంగా 100 డాలర్లకు పెరిగింది. యుద్ధం ముందు వరకు ఇది 70 డాలర్లు ఉండగా..యుద్ధం మొదలవగానే 100 డాలర్లకు పెరిగింది.
దీంతో చమరును గల్ఫ్ దేశాల నుంచి కాకుండా రష్యా నుంచి ఆసియా దేశాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది. దీంతో రష్యా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో చమురు కంపెనీలు భారీగా నష్టాలు మూటగట్టుకుంటున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్, మార్కెటింగ్ నష్టాల ప్రభావం రోజూ రూ.2 వేల కోట్ల వరకు చేరిందని సిస్టమాటిక్స్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) BPCL, HPCL, IOC petrol, డీజిల్‌లపై వరుసగా లీటరుకు రూ. 20, రూ.45 నష్టాలను చవిచూస్తున్నాయి. ఇందులో డీజిల్ మీద రూ. 1,650 కోట్లు, పెట్రోల్‌పై రూ. 350 కోట్లు నష్టం నమోదవుతున్నట్లు అంచనా వేసింది.
OMCల నష్టానికి ప్రధాన కారణం పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు, హై-రిస్క్ జోన్‌లలో రవాణా ఖర్చులు, ట్యాంకర్ రేట్లు, బీమా ప్రీమియంలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్మూజ్ జలసంధి దగ్గర రవాణా సమస్యలు ఏర్పడ్డాయి. అయితే అమెరికా.. రష్యన్ చమురు కొనుగోలుకు భారత్‌కు 30 రోజుల మినహాయింపును కూడా జారీ చేసింది. అయినప్పటికీ లండన్ డేటెడ్ బ్రెంట్‌కి 2 డాలర్ల నుంచి 8 డాలర్ల ప్రీమియంలతో రష్యన్ చమురు సరఫరా చేయబడింది. ఇది గత నెలల పోలికలో పెద్ద మార్పును సూచిస్తోంది.
మార్చి నెలలో డీజిల్ FOB ధర 149.32/bbl డాలర్లు పెట్రోల్ 112.27/bbl డాలర్లుగా నమోదైంది. మరోవైపు ఖతార్ నుండి LNG సరఫరా నిలిపివేయబడడంతో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. ఇది భారతదేశంలో LPG, గ్యాస్ యుటిలిటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది. LPG సరఫరాలో సుమారు 25 శాతం కోత తాత్కాలికంగా ఏర్పడింది. దాంతో వంట గ్యాస్ కొరత, ధరల పెరుగుదల సమస్యలు కొంతమంది వినియోగదారులకు కనిపించాయి.
సిస్టమాటిక్స్ విశ్లేషణ ప్రకారం.. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనెట్ PLNG, డీప్ ఇండస్ట్రీస్, గల్ఫ్ ఆయిల్‌లకు దీర్ఘకాలిక ప్రాధాన్యత ఉంది. OMCల నష్టాలు పెరిగినా, అప్‌స్ట్రీమ్ చమురు ఉత్పత్తి కంపెనీలు బలమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. GRMలు $20/bblకి పైగా పెరగడం, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు 40 డాలర్ల నుంచి 80/bbl డాలర్ల స్థాయిలలో ఉండడం.. పరిశ్రమలో స్థిరమైన లాభాలను చూపుతోంది.
దేశీయ LPG సరఫరాలో 25 శాతం కోత పడటంతో గ్యాస్ వినియోగ కంపెనీలపై స్వల్ప ప్రభావం ఏర్పడింది. షేర్ల కొద్దిగా నష్టాలు సంభవించవచ్చు, కానీ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనెట్ PLNG, డీప్ ఇండస్ట్రీస్, గల్ఫ్ ఆయిల్ షేర్లను సిస్టమాటిక్స్ సిఫార్సు చేసింది. ఆర్‌ఐఎల్ షేరుకు రూ.1,700, గెయిల్ రూ.226, ఇంద్రప్రస్థ గ్యాస్ రూ.226, మహానగర్ గ్యాస్ రూ.1,660, డీప్ ఇండస్ట్రీస్ రూ.693, గుజరాత్ గ్యాస్ రూ.447 లక్ష్య ధరలుగా పేర్కొన్నారు. గెయిల్, గుజరాత్ గ్యాస్‌పై 'హోల్డ్' రేటింగ్ ఇచ్చారు. వీటితో, మార్కెట్‌లో తాత్కాలిక ఒత్తిడిని ఎదుర్కోవడంలో పెట్టుబడిదారులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రష్యాకు అదనపు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం.. ప్రత్యామ్నాయ చమురు అవసరాలను కలిగిన దేశాలకు రష్యా చమురు అందించడానికి అవకాశం కలిగించింది. చమురు ధరలు పెరగడంతో రష్యాకు రోజుకు సుమారు 150 మిలియన్ డాలర్లు (రూ.1,400 కోట్ల) అదనపు ఆదాయం లభిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తత మొదలైన 12 రోజుల్లో 1.3 నుంచి 1.9 బిలియన్ డాలర్ల (రూ. 12,000 నుంచి 17,500 కోట్లు) అదనపు ఆదాయం లభించినట్లు అంచనా.
ప్రస్తుత ధరలు కొనసాగితే.. ఈ నెలాఖరుకు 3.3 నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యా యూరల్స్ చమురు ధర 2 నెలల క్రితం 52 డాలర్లుండగా.. ఇప్పుడు 70-80 డాలర్లకు చేరింది. ప్రస్తుతం రష్యా రోజుకు 3 లక్షల బారెళ్లను ఉత్పత్తి చేస్తోంది, ఇది ఒపెక్+ కోటా కంటే తక్కువ. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రష్యా చమురు ఉత్పత్తిని మరింతగా పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications