నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చే జీతం ఎంత అని అర్థం చేసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా కొత్తగా కెరీర్ ప్రారంభించే యువతకు (Freshers) కంపెనీలు ఇచ్చే భారీ ఆఫర్ లెటర్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కానీ, పేపర్ మీద కనిపించే ఆకర్షణీయమైన ఫిగర్‌కు, మీ బ్యాంకు ఖాతాలో పడే శాలరీ (Salary) కి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటోంది. తాజాగా ఒక స్టార్టప్ ఫౌండర్ బయటపెట్టిన నిజాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

బ్లాక్‌సేబ్లాక్ (BlockseBlock) వ్యవస్థాపకుడు సాహిల్ ఠాకూర్ ఇటీవల లింక్డ్‌ఇన్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆయన దగ్గర చదువుకున్న ఒక విద్యార్థికి ఒక స్టార్టప్ కంపెనీ ఏకంగా రూ. 18 లక్షల వార్షిక ప్యాకేజీ (18 LPA) ఆఫర్ ఇచ్చింది. వినడానికి ఇది చాలా గొప్పగా ఉంది కదా? కానీ, సాహిల్ ఆ ప్యాకేజీని విడమర్చి చూసినప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ 18 లక్షల ప్యాకేజీలో కచ్చితంగా చేతికి వచ్చే ఫిక్స్‌డ్ శాలరీ (Salary) కేవలం 6 లక్షలు మాత్రమే! అంటే నెలకు రూ. 50,000 అన్నమాట. మిగిలిన 12 లక్షలు ఎక్కడికి పోయాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
కంపెనీలు జీతాన్ని ఎలా 'పెంచి' చూపిస్తాయి?
కంపెనీలు తమ సీటీసీ (CTC - Cost to Company) ని భారీగా చూపించడానికి కొన్ని తెలివైన మార్గాలను అనుసరిస్తాయి. సాహిల్ వివరించిన దాని ప్రకారం..
- పర్ఫార్మెన్స్ బోనస్ (Performance Bonus): ఈ ఆఫర్‌లో రూ. 4 లక్షలు బోనస్ కింద ఇచ్చారు. కానీ, ఇది రావాలంటే 120% టార్గెట్స్ రీచ్ అవ్వాలి. మేనేజర్లు పెట్టే టార్గెట్స్ ఎలా ఉంటాయంటే.. వందలో పది మంది కూడా వాటిని పూర్తి చేయలేరు.
- రిటెన్షన్ బోనస్ (Retention Bonus): మరో రూ. 3 లక్షలు రిటెన్షన్ బోనస్ అని చెప్పారు. అంటే మీరు ఆ కంపెనీలో రెండేళ్లు పూర్తి చేస్తేనే ఆ డబ్బులు ఇస్తారు. కానీ, గణాంకాల ప్రకారం చాలా మంది 18 నెలల లోపే ఉద్యోగం మారుతుంటారు. అప్పుడు ఈ డబ్బులు రావు.
- ఈసాప్స్ (ESOPs): మిగిలిన రూ. 5 లక్షలు కంపెనీ షేర్ల రూపంలో (Stock Options) ఇచ్చారు. కంపెనీ ఎప్పుడో భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లోకి వెళ్తే తప్ప వీటికి విలువ ఉండదు. అంటే ఇది ఒక లాటరీ టికెట్ లాంటిదే.
ఫ్రెషర్స్ ఎక్కడ తప్పు చేస్తున్నారు?
చాలా మంది అభ్యర్థులు కేవలం పెద్ద నంబర్ ను చూసి మురిసిపోయి వెంటనే సైన్ చేసేస్తారు. లోపల ఉండే బ్రేక్-అప్ (Break-up) అడగడానికి మొహమాటపడతారు. "నువ్వు సంపాదిస్తోంది 18 లక్షలు కాదు, కేవలం 6 లక్షలు మాత్రమే. మిగిలిన 12 లక్షలు అందని ద్రాక్ష వంటివి" అని సాహిల్ ఆ విద్యార్థిని హెచ్చరించారు.
కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాదు.. అనుభవం ఉన్న వారు కూడా కొన్నిసార్లు ఈ 'ఇన్ ఫ్లేటెడ్ సీటీసీ' (Inflated CTC) మాయలో పడిపోతుంటారు. అందుకే ఆఫర్ లెటర్ చేతికి రాగానే.. నా ఫిక్స్‌డ్ శాలరీ (Salary) ఎంత? ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది? అనే విషయాలను స్పష్టంగా అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications