IIMA MBA May Cost ₹1 Crore in 10 Years: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (IIMA)లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి విద్యార్థుల కోసం మెరిట్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ స్కాలర్ షిప్ ద్వారా విద్యలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థులు ఉచితంగా ఎంబీఏ విద్యను అభ్యసించవచ్చు. ఈ స్కాలర్ షిప్ మొత్తం రూ. 12 కోట్లుగా అంచనా వేశారు. ఈ స్కాలర్ షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు కీలక వ్యాఖ్యలు చేశారు.స్కాలర్‌షిప్ పథకం గురించి నారాయణ మూర్తి మనీ కంట్రోల్‌కు ఇచ్చిన వివరణాత్మక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పుడు ఎంబీఏ చదవడానికి రూ. 28 లక్షలు సరిపోతాయి.. కానీ 10 సంవత్సరాలలో రూ. 1 కోటి అవసరం అవుతుందన్నారు.
ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రధాన విద్యా సంస్థలో ఎంబీఏ చదవడానికి ఒక్కొక్కరికి కనీసం రూ.28 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు.అయితే స్కాలర్‌షిప్ పథకం కింద ప్రతి సంవత్సరం ఒక విద్యార్థిని ఎంపిక చేస్తామని, మొత్తం విద్యా ఖర్చులను స్వయంగా భరిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ల బోర్డులో డైరెక్టర్లలో ఒకరిగా పనిచేస్తున్న ఆయన, ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం ఆధారంగా ఒక ఎంబీఏ విద్యార్థి విద్యా ఖర్చులను భరిస్తానని చెప్పారు. విద్యార్థి విద్యార్హత ఆధారంగా మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుందని ఆయన ప్రకటించారు.

సాధారణంగా.. స్కాలర్‌షిప్ ఇస్తే, అది లక్ష రూపాయలు.. ఎన్ని సంవత్సరాలు వరకు అయినా అదే ఉంటుంది. కానీ నారాయణ మూర్తి ఇచ్చే స్కాలర్ షిప్ ద్రవ్యోల్బణం ఆధారిత పథకం కాబట్టి, విద్యార్థుల విద్యా ఖర్చులు పెరిగేకొద్దీ, తన పథకం కింద మొత్తం మొత్తాన్ని పెంచుతూ ఖర్చులకునుగుణంగా ఇస్తామని తెలిపారు.ప్రస్తుతం ఐఐఎం అహ్మదాబాద్‌లో రెండేళ్ల ఎంబీఏ కోర్సు ఖర్చు రూ.28 లక్షలుగా ఉందని, అయితే రాబోయే పదేళ్లలో అది కోటి రూపాయలకు పెరుగుతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. ఐఐఎంల వంటి పెద్ద విద్యాసంస్థల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు లభించవు కాబట్టి తాను ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు.
కాగా ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన తర్వాత, నారాయణ మూర్తి మొదట ఐఐఎం అహ్మదాబాద్‌లో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. తరువాత ఇన్స్టిట్యూట్ గవర్నర్ల బోర్డుకు అధ్యక్షత వహించారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. భారతదేశంలో దాదాపు 400 పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని.. ఈ 400 కార్పొరేట్ కంపెనీలు ప్రతి విద్యార్థి విద్యా ఖర్చులను భరిస్తే, చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో పాటుగా భారతీయ ఉన్నత విద్యలో నిధులపై ఉన్న అడ్డంకులు, AI-ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు గురించి ఆయన చర్చించారు. మన ఉత్పాదకతను మెరుగుపరచుకోవడానికి, మన జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి AIని సహాయక ఏజెంట్‌గా ఉపయోగిస్తే అందరూ గొప్ప విజేతలుగా నిలుస్తారన్నారు. టెక్నాలజీ ఉద్యోగాలను తీసివేస్తుందనే ఈ మొత్తం భయం సరైనది కాదు. ఇది వేరే రకమైన ఉద్యోగాన్ని సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు. AI ఉద్యోగాలను తీసివేస్తుందనే భయం పూర్తిగా సరికాదని.. ఐటీ పరిశ్రమ పట్ల తనకు చాలా సానుకూల దృక్పథం ఉందని నారాయణ మూర్తి అన్నారు.
ఇక ChatGPT ని ఆయన ఉపయోగించుకున్న విధానం గురించి తెలిపారు. గత ఆరు నెలలు నుంచి నా ఉపన్యాసం ముసాయిదాను సిద్ధం చేసుకోవడానికి నేను ChatGPTని ఉపయోగిస్తున్నాను. గతంలో దీన్ని సిద్ధం చేయడానికి దాదాపు 25 నుండి 30 గంటలు పట్టేది. ChatGPT-4తో కేవలం 5 గంటల్లోనే ఉపన్యాసాన్ని సిద్ధం చేసుకున్నానని తెలిపారు. నేను నా స్వంత ఉత్పాదకతను 5 రెట్లు పెంచుకున్నాను. కాబట్టి, సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలు మోడల్‌లను, పోగ్రాంలను సృష్టించడానికి AI ని ఉపయోగిస్తే వాటిల్లో భారీగా అవకాశాలు ఉంటాయని నారాయణ మూర్తి తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications