నెలకు లక్షన్నర జీతం.. కట్టే ఈఎమ్ఐలు రూ. 1. 80 లక్షలు.. బయటపడే మార్గం చెప్పాలంటూ భోరుమంటున్న టెకీ..

స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ రూపంలో సులువుగా డబ్బు సంపాదించవచ్చు అనే వలలో చిక్కుకుని ఒక ఐటీ నిపుణుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ముంబైలోని ఒక ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో నెలకు రూ. 1.6 లక్షల జీతంతో మేనేజర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల వ్యక్తి.. ట్రేడింగ్ నష్టాల కారణంగా ఏకంగా రూ. 60 లక్షల అప్పుల్లో చిక్కుకున్నట్లు రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్న కథనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో సరదాగా ప్రారంభమైన F&O ట్రేడింగ్.. నెమ్మదిగా ఒక తీవ్రమైన వ్యసనంగా మారినట్లు ఆ బాధితుడు పేర్కొన్నారు. ప్రారంభంలో వచ్చిన చిన్న చిన్న నష్టాలను పూడ్చుకోవడానికి (Loss Recovery) మరింత అగ్రెసివ్‌గా ట్రేడింగ్ చేస్తూ పోవడంతో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయి. ఈ క్రమంలో ఆయన దాదాపు రూ. 80 లక్షల వరకు సొంత, అప్పుగా తెచ్చిన సొమ్మును కోల్పోయారు.

Stock Market Losses IT Professional Salary EMI Debt Stock Trading Share Market Personal Finance Financial Crisis Investment Loss Trading Loss Loan EMI Money Management Business News India News

ప్రస్తుతం ఆయనపై రెండు పర్సనల్ లోన్లు, పలు డిజిటల్ లోన్ యాప్‌ల బకాయిలతో పాటు సుమారు రూ. 7 లక్షల క్రెడిట్ కార్డ్ బిల్లులు పేరుకుపోయాయి. ప్రతి నెలా ఆయన చెల్లించాల్సిన EMI బాధ్యత రూ. 1.85 లక్షలకు చేరింది. అయితే ఆయన నెలసరి చేతికి వచ్చే జీతం రూ. 1.6 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. అంటే వచ్చే జీతం కంటే చెల్లించాల్సిన కిస్తీలే ఎక్కువగా మారడంతో తీవ్రమైన నగదు కొరత (Cash Crunch) ఏర్పడింది.

ఇప్పటివరకు ఏ ఒక్క EMI చెల్లింపును కూడా ఆపలేదని.. కానీ రాబోయే రోజుల్లో ఈ భారాన్ని మోయడం అసాధ్యంగా అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి భార్య, పిల్లలు ఉన్నారని, తన ఆర్థిక పరిస్థితి తీవ్రత గురించి వారికి ఏమీ తెలియదని అన్నారు. రికవరీ ఏజెంట్లు ఇంటికి రావడం లేదా ఫోన్లు చేయడం ద్వారా ఈ విషయం తన కుటుంబానికి తెలిసిపోతుందేమోనని రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని పేర్కొన్నారు.

Also Read

అప్పులను ఏకీకృతం చేయడానికి లేదా అదనపు రుణం కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని, వరుసగా రుణాలు తీసుకోవడం వల్ల బ్యాంకులు తిరస్కరిస్తున్నాయని చెప్పారు. తాను ట్రేడింగ్‌ను పూర్తిగా ఆపేశానని.. తక్షణమే నెలవారీ EMI భారాన్ని రూ. 1.2-1.3 లక్షలకు తగ్గించుకుని.. క్రమపద్ధతిలో అప్పులన్నీ తీర్చడానికి ఆచరణాత్మక మార్గాన్ని సూచించాలని తోటి నెటిజన్లను అభ్యర్థించారు.

ఈ పోస్ట్‌పై స్పందించిన పలువురు అనుభవజ్ఞులైన రెడ్డిట్ వినియోగదారులు ఆచరణాత్మకమైన సలహాలను అందించారు. అత్యధిక వడ్డీ (30% పైగా) వసూలు చేసే క్రెడిట్ కార్డ్ బకాయిలు, లోన్ యాప్‌లను ముందుగా క్లోజ్ చేయాలని, పర్సనల్ లోన్లను సాధారణ కాలపరిమితిలో ఉంచాలని సూచించారు. అలాగే బంగారం, కారు లేదా ఏదైనా స్థిరాస్తి ఉంటే విక్రయించడం ద్వారా లేదా తక్కువ వడ్డీకి లభించే 'ఆస్తిపై రుణం' (Loan Against Property) తీసుకోవడం ద్వారా అధిక వడ్డీ రుణాలను తీర్చివేసి, EMIని తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు.

ఈ మానసిక పోరాటాన్ని ఒంటరిగా చేయలేరని.. భార్యకు పరిస్థితి వివరించి జీవనశైలి ఖర్చులను తగ్గించుకోవాలని పేర్కొన్నారు. చివరగా వ్యసనం తిరగబెట్టకుండా ఉండేందుకు డిమాట్ ఖాతాలను శాశ్వతంగా మూసివేసి, కొంతకాలం మార్కెట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించారు.

పెట్టుబడులు పెట్టడానికి లేదా ట్రేడింగ్ చేయడానికి ఎప్పుడూ అప్పులు చేయకూడదని, F&O అనేది అవగాహన లేకపోతే తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రక్రియ అని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సరిపడా అత్యవసర నిధి (Emergency Fund) లేకుండా, రుణాలపై ఆధారపడి ట్రేడింగ్‌లోకి దిగడం దారుణమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+