టాప్ 10 కంపెనీల్లోని 5 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగి, మొదటి రెండు స్థానాల్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ కంపెనీలు భారీగా ప్రభావం చూపాయి. వీటితో పాటు ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ భారీగా క్షీణించింది. HDFC బ్యాంకు, HDFC లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, బారతీ ఎయిర్టెల్ మంచి లాభాలు నమోదు చేశాయి. టాప్ 10లోని 5 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,160 పడిపోయింది.

ఎం-క్యాప్ తగ్గిన కంపెనీలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ గత వారం భారీగా పడిపోయింది.
రిలయన్స్ ఎం-క్యాప్ రూ.69,378.51 క్షీణించి రూ.12.84 లక్షల కోట్లకు దిగి వచ్చింది. గతంలో రూ.15 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్, ఇప్పుడు ఏకంగా రూ.13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది.
టీసీఎస్ మార్కెట్ క్యాప్ 4,165.14 కోట్లు క్షీణించి రూ.9.97 లక్షల కోట్లకు పడిపోయింది. ఇటీవల రూ.10 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న టీసీఎస్ ఇప్పుడు ఆ కిందకు పడిపోయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.16,211.94 కోట్లు తగ్గి రూ.4.98 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.12,948.61 కోట్లు క్షీణించి రూ.4,69,834.44 కోట్లుగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.4,455.8 పడిపోయి రూ.3.31 లక్షల కోట్లుగా ఉంది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,938.48 కోట్లు పెరిగి రూ.4.19 లక్షలకు పెరిగింది.
HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.18,827.94 ఎగిసి రూ.7.72 కోట్లకు చేరింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,747.08 ఎగిసి రూ.2.84 కోట్లకు ఎగిసింది.
భారతీ ఎయిర్టెల్ ఎంక్యాప్ రూ.1,145.67 పెరిగి రూ.2.63 లక్షల కోట్లుగా ఉంది.
కొటక్ మహీంద్ర మార్కెట్ క్యాప్ రూ.23,445.93 కోట్లకు పెరిగింది.

టాప్‌లోనే రిలయన్స్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలోనే ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
గత వారం బీఎస్ఈ 30 సెన్సెక్స్ 439.25 పాయింట్లు (1.01 శాతం) ఎగిసింది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications