IPO News: చరిత్ర సృష్టింబోతున్న ఐపీవో.. షేర్ల కోసం మీరూ అప్లై చేశారా..??
IPO News: ఒకదాని తర్వాత మరొకటి గ్యాప్ లేకుండా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోల రాక కొనసాగుతూనే ఉంది. దీంతో ఇన్వెస్టర్లకు ఖాళీ లేకుండా కాసుల పంట కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చరిత్ర సృష్టించేందుకు ఒక ఐపీవో సిద్ధంగా ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రేపు మార్కెట్లలోకి అడుగుపెడుతున్న ఆర్ఆర్ కాబెల్ ఐపీవో గురించే. సెప్టెంబర్ 20న లిస్టింగ్ కాబోతున్న కంపెనీ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే క్స్ఛేంజీల్లో అడుగుపెడుతున్న మొదటి కంపెనీగా నిలిచింది. కంపెనీ ఫ్రెష్ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో మెుత్తం రూ.1,964 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే షేర్ల కేటాయింపు ప్రారంభమైంది. లాటరీ ఆధారంగా వచ్చిన దరఖాస్తులకు రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. అయితే లిస్టింగ్ కి ముందు గ్రేమార్కెట్లో ఒక్కో షేరు దాదాపు రూ.104 ప్రీమియంతో ట్రేడవుతోంది. కంపెనీ షేర్లను అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయిన 1035 రూపాయల వద్ద ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించినట్లయితే స్టాక్ ప్రస్తుతం 10 శాతం ప్రీమియం ధరను కలిగి ఉంది. ఇదే రేటుకు లిస్ట్ అయితే షేర్ ధర రూ.1,139గా నమోదు కావొచ్చని తెలుస్తోంది.
ఇదే సమయంలో ఆర్‌ఆర్ కాబెల్‌లో 21 శాతం వాటాను కలిగి ఉన్న అమెరికా ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్, ఒఎఫ్‌ఎస్‌లో భాగంగా కంపెనీలో తన వాటాలను పాక్షికంగా విక్రయించాలని చూస్తోంది. RR కాబెల్ తాజా ఇష్యూల ద్వారా వచ్చిన రూ.170 కోట్ల నికర ఆదాయాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాల చెల్లింపులకు ఉపయోగించాలని ప్రతిపాదించింది. 2021-22లో కంపెనీ రూ.214 కోట్ల నికర లాభాన్ని, రూ.4,386 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డిసెంబర్ 2022తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ రూ.125 కోట్ల నికర లాభం, రూ.4,083 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. కంపెనీ ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications