IPO News: గ్రేమార్కెట్లో గర్జిస్తున్న ఐపీవో ధర.. రేపే తెరుచుకోనున్న అవకాశం..
IPO News: ఇన్వెస్టర్ల కోసం ఇంకా తెరవక ముందరే గ్రేమార్కెట్లో ఒక ఐపీవో ధర రాకెట్ వేగంతో ముందుకు సాగుతోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో అనూహ్యంగా లభిస్తున్న స్పందన దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది రేపు ప్రారంభం కానున్న RR Kabel ఐపీవో గురించే. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఇష్యూ సాధారణ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరబడుతోంది. దీనికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 12న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. దీనిపై బెట్టింగ్ చేసేందుకు చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం నేడు RR కేబుల్ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం ఒక్కో షేరుకు రూ.218గా ఉంది. అంటే RR కేబుల్ షేర్లు వాస్తవ ఇష్యూ ధర కంటే రూ.218 ఎక్కువగా ఉంది. ఇది కంపెనీ నిర్ణయించిన ఐపీవో ఇష్యూ ధర రూ.1,035 కంటే 21.06% ప్రీమియంను సూచిస్తోంది. ఇదే గనుక కొనసాగితే లిస్టింగ్ సమయంలో షేర్ ధర రూ.1,253గా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
RR కేబుల్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.983-1,035గా నిర్ణయించినట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ తాజా ఐపీవో ప్రక్రియ ద్వారా మార్కెట్ల నుంచి రూ.1,964 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. IPOలో రూ.180 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, ప్రమోటర్లు ఇన్వెస్టర్ల ద్వారా రూ.1,784 కోట్ల విలువైన 1.72 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications