IPO News: తొలిరోజే ఐపీవో లాభాల సునామీ.. ధనవంతులైన ఇన్వెస్టర్లు.. ఎంజాయ్..
RR Kabel IPO: ఈరోజే స్టాక్ మార్కెట్లలోకి ఆర్ఆర్ కాబెల్ కంపెనీ షేర్లు ప్రీమియం ధరకు లిస్ట్ అయ్యాయి. 15 శాతం ప్రీమియం ధరకు షేర్లు మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఇన్వెస్టర్లు తొలిరోజే ధనవంతులుగా మారారు.
ఆర్ఆర్ కాబెల్ షేర్లపై పందెం వేసిన ఇన్వెస్టర్ల నిరీక్షణ ఫలించింది. కంపెనీ షేర్ బీఎస్ఈలో రూ.1,179 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.1,180 వద్ద విజయవంతమైన లిస్టింగ్ పూర్తయింది. అద్భుతమైన లిస్టింగ్ కారణంగా ఇన్వెస్టర్లు బాగా లాభపడ్డారు. కంపెనీ షేర్లను రూ.983-1035 ధరకు ఇన్వెస్టర్లకు విక్రయించింది. అయితే లిస్టింగ్ తర్వాత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్రయత్నించారు.

కంపెనీ సబ్‌స్క్రిప్షన్ పరిశీలిస్తే మూడవ రోజున 18.69 రెట్లు నమోదైంది. ఐపీవోకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.585.62 కోట్ల స్పందన లభించింది. ఈ నెల 12న తెరవబడిన ఐపీవో ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే ఎక్స్ఛేంజీల్లో అడుగుపెట్టిన తొలి కంపెనీగా నిలిచింది. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 1, 2023 వరకు ఉంది.
కంపెనీ ఐపీవోలో లాట్ 14 షేర్లతో రూ.14,490 ధరగా నిర్ణయించింది. ఒక్కలాట్ అలాట్ అయిన ఇన్వెస్టర్లకు ఒక్కరోజులోపే రూ.2,000 వరకు లాభం వచ్చింది. కంపెనీకి ప్రస్తుతం హావెల్స్ ఇండియా లిమిటెడ్, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్, KEI ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, V-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రత్యర్థి కంపెనీలుగా మార్కెట్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications