IPO News: దేశంలోని స్టాక్ మార్కెట్ల విస్తరణ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చాలా మంది యువత మార్కెట్లలోకి పెట్టుబడిదారులుగా అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లలోకి తీసుకొస్తున్నాయి.
తాజాగా కేబుల్స్ తయారీ సంస్థ RR కాబెల్ లిమిటెడ్ తన ఐపీవోను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టింది. ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి నిధునలను సేకరించడానికి సెబీ నుంచి ఆమోదాన్ని పొందింది. ఈ కంపెనీ TPG క్యాపిటల్ మద్దతుతో ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. తాజాగా పబ్లిక్ ఆఫరింగ్ కోసం మే నెలలో ముదాయిదా పత్రాలను దాఖలు చేయగా ఆమోదాన్ని పొందింది.

కంపెనీ DRHP ప్రకారం ఐపీవో ద్వారా రూ.225 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని చూస్తోంది. అయితే ఇందులో తాజా ఇష్యూతో పాటు ప్రమోటర్ల ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుందని వెల్లడైంది. మార్కెట్ రెగ్యులేటర్ ఆగస్టు 24న ఆమోదానికి సమానమైన పరిశీలన లేఖను కంపెనీకి అందించింది. ముసాయిదా పత్రాల ప్రకారం.. మహేంద్రకుమార్ రామేశ్వర్‌లాల్ కబ్రా, హేమంత్ మహేంద్రకుమార్ కబ్రా, సుమీత్ మహేంద్రకుమార్ కబ్రా, కాబెల్ బిల్డ్‌కాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్ రత్న వైర్స్ లిమిటెడ్‌లు OFSలో వాటాలను విక్రయిస్తున్నాయి.
ఇదే సమయంలో ఆర్‌ఆర్ కాబెల్‌లో 21 శాతం వాటాను కలిగి ఉన్న అమెరికా ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్, ఒఎఫ్‌ఎస్‌లో భాగంగా కంపెనీలో తన వాటాలను పాక్షికంగా విక్రయించాలని చూస్తోంది. RR కాబెల్ తాజా ఇష్యూల ద్వారా వచ్చిన రూ.170 కోట్ల నికర ఆదాయాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాల చెల్లింపులకు ఉపయోగించాలని ప్రతిపాదించింది. 2021-22లో కంపెనీ రూ.214 కోట్ల నికర లాభాన్ని, రూ.4,386 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డిసెంబర్ 2022తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ రూ.125 కోట్ల నికర లాభం, రూ.4,083 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. కంపెనీ ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications