Finance Bill 2023: దేశీయ రాయల్టీ పన్ను డబుల్ చేసిన కేంద్రం.. స్టార్టప్ కంపెనీల ఆశలపై నీళ్లు..!!
Finance Bill 2023: పన్నులు, ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన ఫైనాన్స్ బిల్లు-2023 కొన్ని సవరణల తర్వాత నేడు లోక్‌సభలో ఆమోదాన్ని పొందింది. ఇందులో విదేశీ కంపెనీలకు రాయల్టీ పన్నును పెంచేందుకు ప్రతిపాదిత సవరణకు పార్లమెంటు ఆమోదం లభించింది.
తాజా ఫైనాన్స్ బిల్లు సవరణ ప్రకారం నాన్-రెసిడెంట్ విదేశీ సంస్థలు సంపాదించే సాంకేతిక సేవల నుంచి రాయల్టీలు, రుసుములపై పన్ను రేటును గతంలో ఉన్న 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. దీని ఫలితంగా కంపెనీలకు అదనపు పన్ను రిటర్న్స్ దాఖలు, ప్రత్యేక ఫారమ్ లు వంటి చిక్కులు ఎదురుకానున్నాయని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.

ఏంజిల్ టాక్స్ విధానంలో గణనీయమైన మార్పులను స్టార్టప్ కంపెనీలు ఆశించాయి. విదేశీ కంపెనీలు, సావరిన్ వెల్త్ ఫండ్స్, ఎండోమెంట్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ నుంచి వచ్చే పెట్టుబడులను ఏంజెల్ టాక్స్ విధానం నుంచి మినహాయించాలని పరిశ్రమ సూచించింది. అయితే తాజాగా ఫైనాన్స్ బిల్లులో ఆమోదించబడిన మార్పులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమలులోకి వస్తాయి. దీంతో స్టార్టప్ కంపెనీలు ఊహించిన ఉపశమనం లభించలేదు. ఇన్వెస్టర్లు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
కొత్త టాక్స్ రూల్స్ సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబల్, ఆల్ఫా వేవ్, సీక్వోయా వంటి విదేశీ ఇన్వెస్టర్లు దేశంలోని స్టార్టప్ కంపెనీల్లో చేస్తున్న పెట్టుబడులను తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలుస్తోంది. మనీలాండరింగ్‌ను నిరోధించడానికి దుర్వినియోగ నిరోధక చర్యగా ఏంజెల్ టాక్స్ విధానం వాస్తవానికి 2012లో ప్రారంభించబడింది.


Click it and Unblock the Notifications