ముంబై: ద్విచక్ర వాహనాల సెక్టార్ అగ్రస్థానంలో కొనసాగుతోన్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. మరో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దేశీయ మార్కెట్‌లో దీన్ని ప్రవేశపెట్టింది. 2021 ఎడిషన్ ఇది. ఈ లేటెస్ట్ వర్షన్ బైక్ పేరు.. హిమాలయన్. అడ్వెంచర్ బైక్‌గా దీన్ని అభివర్ణిస్తున్నాయి మార్కెట్ వర్గాలు. మొత్తం ఆరు వర్షన్లలో ఈ బైక్‌ను అందుబాటులోకి తీసుకొ్చ్చిందా సంస్థ. ఒక్కో వర్షన్‌కు ఒక్కో రేటును నిర్ధారించింది. ఆయా ధరలన్నీ రెండు లక్షల రూపాయలకు పైమాటే.
ఢిల్లీలో ఈ బైక్ ధర 2,01,314 రూపాయలు. అది బేసిక్ మోడల్ ధర. హైఎండ్ మోడల్ రెండున్నర లక్షల రూపాయల వరకు పలుకుతోంది. గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఈ బైక్ బుకింగ్స్ ఆరంభమైనట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు వర్షన్లు, మూడు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. కాస్మెటిక్ అప్‌డేట్స్, నేవిగేషన్ సిస్టమ్ దీని ప్రత్యేకత. గత ఏడాదే దీన్ని దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేయాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడుతూ వచ్చింది. ఫలితంగా- ఈ బైక్‌పై వాహనదారుల్లో ఆసక్తి పెరిగింది.

గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫాంతో కూడిన నేవిగేషన్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా వాహనదారులు తమ స్మార్ట్‌ఫోన్‌కు ఈ నేవిగేషన్ వ్యవస్థను అనుసంధానించుకోవచ్చు. సుదీర్ఘ సమయం పాటు డ్రైవ్ చేయడానికి అనుకూలంగా సీటింగ్‌లో మార్పులు చేసింది. గతుకుల రోడ్లు, పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు అనుకూలంగా ఈ హిమాలయన్ బైక్ వర్షన్‌ను అప్‌డేట్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. అందుకే దీనికి అడ్వెంచర్ బైక్‌గా విశ్లేషిస్తున్నారు.

గ్రానైట్ బ్లాక్, మిరేజ్ సిల్వర్, పైన్ గ్రీన్, రాక్ రెడ్ రంగుల్లో లభించే హిమాలయన్ 411 సిసి, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. మిరాజ్ సిల్వర్-2,36,286, గ్రావెల్ గ్రే-2,36,286, లేక్ బ్లూ-2,40,285, రాక్ రెడ్-2,40,285, గ్రానైట్ బ్లాక్-2,40,285,
పైన్ గ్రీన్-2,44,284 రూపాయల్లో లభిస్తోంది. లఢక్ వంటి సుదీర్ఘ ప్రాంతాలకు డ్రైవ్ చేయాలనుకునే వారు, బైక్ ట్రెక్కర్లకు ఇది అనుకూలంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications