Royal Enfield offer: యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ దాన్ని సొంతం చేసుకోవాలంటే భారీగా ఖర్చు పెట్టక తప్పదు. రీసేల్ వాల్యూ బాగానే ఉన్నా వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ బైక్ సేల్స్ విపరీతంగా పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా బైబ్యాక్ ప్రోగ్రామ్ ప్రకటించింది. OTO క్యాపిటల్ తో జతకట్టి మూడేళ్ల వ్యవధితో తిరిగి కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చింది. దీని ద్వారా 45 శాతం తక్కువ EMIతో పాటు కాల వ్యవధిని బట్టి 77 శాతం వరకు గ్యారెంటీతో కూడిన బైబ్యాక్ విలువను పొందవచ్చు. టెన్యూర్ ముగింపు సమయంలో ప్రోత్సాహకంగా క్యాష్‌బ్యాక్ సైతం ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

'బైక్ కాన్సెప్ట్ మరియు డెవలప్‌మెంట్ దశ నుంచి వాడుక వరకు.. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాం. నిబద్ధతతో కూడిన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాం అనడానికి ఈ అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ఉదాహరణ. యజమానులు మనశ్శాంతితో రైడింగ్‌ను ఆస్వాదించేందుకు మొదటిసారిగా వినూత్న ప్రోగ్రామ్ మొదలుపెట్టాం' అని రాయల్ ఎన్‌ఫీల్డ్ CEO గోవిందరాజన్ తెలిపారు.
ముందుగా నిర్ణయించిన వ్యవధి ముగిసిన అనంతరం బైక్ ను తిరిగి ఇచ్చేందుకు లేదా రీసేల్ ద్వారా మరో కొత్త వాహనం కొనేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ అవకాశం కల్పిస్తోంది. ఈ అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, లక్నో, జైపూర్, భోపాల్, ఇండోర్, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా 12 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఇతర నగరాలకు సైతం విస్తరించనుంది.


Click it and Unblock the Notifications