కొత్త బైక్ కొనే ప్లాన్ చేస్తున్నవారికి చిన్న షాక్! GST 2.0 మార్పులు, ముఖ్యంగా 350cc పైగా బైక్‌లకు, ఆన్-రోడ్ ధరను గణనీయంగా పెంచబోతున్నాయి. మొదట 10%-15% మాత్రమే ధర పెరుగుతుందని ఊహించినా, సరిగ్గా లెక్కించినప్పుడు ఖర్చు చాలా ఎక్కువగా పెరుగుతుందనే విషయం స్పష్టమవుతోంది.

ప్రస్తుతం 350cc పైగా బైక్‌లకు ఉన్న టాక్స్ స్ట్రక్చర్ రివైజ్ అవుతుంది. దాంతో ఆన్-రోడ్ ధర 30% లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చని విశ్లేషణలు చెబుతున్నారు. అసలు సమస్య ఏమిటంటే, టాక్స్ పెంపు కాంపౌండ్‌గా బైక్ ప్రైస్, RTO రోడ్డు టాక్స్, ఇన్సూరెన్స్ పై వర్తిస్తుంటుంది. అందుకే ఫైనల్ ప్రైస్ రూ. 20,000-రూ. 45,000 వరకు పెరుగుతుంది.
Team BHP చేసిన విశ్లేషణ ప్రకారం, అన్ని బ్రాండ్‌ల ప్రీమియం బైక్‌లు దీన్ని ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు, Royal Enfield Interceptor 650, ప్రస్తుతం ఆన్-రోడ్ ధర రూ. 3.80 లక్షలైతే, కొత్త ధర రూ. 4.13 లక్షల వరకు చేరవచ్చు, అంటే 34% పెరుగుదల. అలాగే KTM 390 Duke, ప్రస్తుతం రూ. 3.60 లక్షలుగా ఉంటే, కొత్త ధర రూ. 3.91 లక్షలకు చేరుతుంది, అంటే 32% పెరుగుదల.
ప్రతి మోడల్‌పై పెరుగుదల ఒకేలా ఉండకపోయినా, ఎక్కువగా 30% చుట్టు పక్కలనే ఉంటుంది. GST మార్పులు ప్రీమియం సెగ్మెంట్‌లో ఎంత ప్రభావం చూపుతున్నాయో.
చిన్న బైక్‌ల కోసం కొంత ఉపశమనం రావచ్చేమో, కానీ పెద్ద మరియు ప్రీమియం బైక్‌ల కొనుగోలు ఇప్పుడు కాస్త కష్టతరం అయిపోతుంది. కొత్త డ్రీమ్ రైడ్ కోసం డబ్బు సేవ్ చేసిన వారికి, షోరూమ్‌కు వెళ్ళడం ఇప్పటి నుంచి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది.
కొత్త GST 2.0 మార్పులు బైక్ ధరను పెంచబోతున్నందున, EMI లేదా పర్సనల్ లోన్ ద్వారా బైక్ కొనడం పక్కాగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే, బైక్ యొక్క ఆన్-రోడ్ ధర పెరిగితే, దానికి సంబంధించిన EMI కూడా ఎక్కువ అవుతుంది. మినహాయింపులు, ప్రాసెసింగ్ ఫీ, మరియు ఇంటరెస్ట్ ఛార్జీలు కూడా ప్రపోర్షనల్ గా పెరుగుతాయి. స్మార్ట్ గా చెప్పాలంటే, మీరు నెలసరి బడ్జెట్ లెక్కలో ఈ కొత్త బర్డెన్ ను కూడా కన్సిడర్ చేయాలి, లేక ఫైనాన్షియల్ స్ట్రెస్ అనుకోకుండా పెరుగుతుంది.
GST పెంపు కేవలం బైక్ ప్రైస్‌కి మాత్రమే ప్రభావం చూపదు, యాక్ససరీలు, స్పేర్ పోర్ట్స్, సర్వీసింగ్ ఛార్జీలు ఇంకా ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే, fuel, సర్వీస్, parts మార్చుకోవడం, లేదా వారంటీ రెన్యూ చేయడం వంటి ప్రతిరోజూ మెయింటైన్స్ ఖర్చులు కూడా కొంత పెరుగుతాయి. కాబట్టి, కొత్త బైక్ కొనడానికి ముందే ఈ extra ఖర్చులను కూడా బడ్జెట్ లో కన్సిడర్ చేయడం స్మార్ట్ మూవ్ అవుతుంది.


Click it and Unblock the Notifications