రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అంటే యూత్ కి ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లెట్ బండిని సొంతం చేసుకోవాలనేది చాలామంది యువతకు ఒక కల. ఈ బైక్ కొనాలంటే ఇప్పుడు కనీసం 2.30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా 39 ఏళ్ల క్రితం ఈ బైక్ ధర ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ ధర కంటే తక్కువగా ఉండేదని తెలిస్తే మీరు నమ్ముతారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ (Trending) లో ఉంది. 1986 నాటి బుల్లెట్ బైక్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా బుల్లెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వైరల్ అవుతున్న 1986 నాటి బిల్లు!
జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన 'సందీప్ ఆటో' అనే షోరూమ్ ఇచ్చిన ఈ చారిత్రక బిల్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. 1986, జనవరి 23వ తేదీ నాటి ఈ రశీదు ప్రకారం.. అప్పట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర కేవలం 18,700 రూపాయలు మాత్రమే. అంటే నేటి ధరతో పోలిస్తే ఇది దాదాపు 12 రెట్లు తక్కువ. ఈ విషయం తెలుసుకున్న నేటి తరం యువత ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బుల్లెట్ బైక్‌కు ఒకసారి సర్వీసింగ్ చేయించి, కొన్ని యాక్సెసరీస్ కొంటేనే దాదాపు అంత ఖర్చవుతోంది.
అప్పట్లో బుల్లెట్ అంటే ఒక హోదా!
1980 వ దశకంలో 18,700 రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం. అప్పట్లో బుల్లెట్ బైక్ ఉందంటే వారు సమాజంలో చాలా ధనికులుగా, ఉన్నత హోదా కలిగిన వారిగా గుర్తింపు పొందేవారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ , పోలీస్ అధికారుల మొదటి ఛాయిస్ బుల్లెట్ మాత్రమే ఉండేది. వైరల్ అవుతున్న ఆ బిల్లులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ బైక్ అసలు ధర 18,800 రూపాయలు కాగా.. కస్టమర్‌కు 100 రూపాయల డిస్కౌంట్ ఇచ్చి 18,700 రూపాయలకే విక్రయించారు.
పాత లుక్.. సరికొత్త టెక్నాలజీ!
గడిచిన ఈ 39 ఏళ్లలో బుల్లెట్ ధరతో పాటు దాని ఇంజనీరింగ్ కూడా భారీగా మారింది. 1986 మోడల్‌లో గేర్లు, బ్రేకులు ఇప్పుడున్న బైక్‌లకు పూర్తి భిన్నంగా ఉండేవి. కానీ, నేటి బుల్లెట్ 350 అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. ఇందులో 349cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ 'జె' సిరీస్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS , డిస్క్ బ్రేక్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ తన పాత క్లాసిక్ డిజైన్ , ఆ ఐకానిక్ "డుగ్-డుగ్" సౌండ్ ను ఏమాత్రం మార్చలేదు.
మొత్తంగా చూస్తే.. ధరలు 18 వేల నుండి 2.5 లక్షలకు పెరిగినా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 పట్ల ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు సరే కదా.. ఇంకా పెరిగింది. అప్పట్లో క్రమశిక్షణకు, దృఢత్వానికి చిహ్నంగా ఉన్న ఈ బైక్, నేడు యువత లైఫ్‌స్టైల్‌లో ఒక భాగంగా మారిపోయింది. సోషల్ మీడియా ట్రెండింగ్ (trending) లో ఉన్నఈ బిల్లు మనకు ఒక గొప్ప చరిత్రను గుర్తు చేస్తోంది. పాత కాలపు సరళత, నేటి వేగం కలగలిసిన బుల్లెట్ 350 ఎప్పటికీ ఒక టైంలెస్ ఇన్వెస్ట్‌మెంట్‌గానే నిలుస్తుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications