IPO News: స్టాక్ మార్కెట్లోకి వరుసగా క్యూకడుతున్న ఐపీవోలతో ఇన్వెస్టర్లు సైతం బిజీబిజీగా ఉంటున్నారు. అయితే ఈ నెలలో మార్కెట్లోకి లిస్టింగ్ కోసం కొన్ని అద్భుతమైన ఐపీవోలు వచ్చేశాయి. దీంతో కోలాహలం నెలకొంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ROX హైటెక్ కంపెనీ ఐపీవో గురించే. చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం ఈ ఐపీవో మీద పడింది. దీంతో మూడు రోజుల పాటు కొనసాగిన సబ్‌స్క్రిప్షన్ సమయంలో 291 కంటే ఎక్కువ సార్లు షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. అయితే ఇది పెద్ద శుభపరిణామంగానే తెలుస్తోంది. ఎందుకంటే గ్రేమార్కెట్లో ఐపీవో భారీ గిరాకీతో మంచి పనితీరును కనబరుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు తొలిరోజే భారీ లాభాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు.

నవంబర్ 7, 2023న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో తెరవబడింది. ఇది నవంబర్ 9న ముగిసింది. ఈ కాలంలో బలమైన డిమాండ్ నమోదు చేసింది. ఐపీఓపై పందెం కాసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు షేర్ల కేటాయింపుపై కన్నేశారు. నవంబర్ 15న ROX హైటెక్ షేర్ల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. బ్రోకరేజీలు అందించిన సమాచారం ప్రకారం కంపెనీ ఐపీవో గ్రేమార్కెట్లో సూపర్ ప్రీమియం రేటు పలుకుతోంది.
ఈ ట్రెండ్ లిస్టింగ్ వరకు కొనసాగితే ROX హైటెక్ షేర్ల కేటాయింపు రూ.183 వద్ద ఉంటుందని తెలుస్తోంది. అంటే ఒక్కో షేరుపై రూ.100 లాభం కేవలం అరంగేట్రంతోనే ఇన్వెస్టర్లు పొందనున్నారు. వాస్తవానికి ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను గమనిస్తే రూ.80 నుంచి రూ.83గా కంపెనీ నిర్ణయించింది. గ్రేమార్కెట్ పరిణామాల ప్రకారం ఇన్వెస్టర్లు తొలిరోజే ఇష్యూ ధరపై 120 శాతం రాబడులను పొందుతారని తెలుస్తోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. అందువల్ల ఐపీవోలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కనీసం రూ.1,32,800 వెచ్చించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications