IPO News: లాభాల బాంబు పేల్చిన ఐపీవో.. తొలిరోజే ధనవంతులైన ఇన్వెస్టర్లు.. మీరూ కొన్నారా?
IPO News: ఊహించిన విధంగానే నేడు మార్కెట్లో అడుగుపెట్టిన చౌక ఐపీవో ఇన్వెస్టర్లకు తొలిరోజే కళ్లు చెదిరే లాభాలను అందించింది. ప్రీమియం ధరకు లిస్టింగ్ నమోదు చేసిన ఐపీవో తన సత్తాను చాటుకుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రోక్స్ హైటెక్ లిమిటెడ్(Rox Hi-Tech Limited) కంపెనీ ఐపీవో లిస్టింగ్ గురించే. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈలో ఒక్కో షేరు రూ.135 రేటు వద్ద మార్కెట్లోకి అరంగేట్రం చేసింది. వాస్తవానికి సబ్ స్క్రిప్షన్ కోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.80-83గా ప్రకటించింది. అయితే ప్రీమియం రేటు వద్ద ఐపీవో లిస్టింగ్ జరగటంతో ఒక్కో షేరుపై ఇన్వెస్టర్లు 62.65 శాతం లాభాన్ని క్షణాల్లో అందుకున్నారు.

ఐపీవో లిస్టింగ్ జరిగిన కొన్ని నిమిషాల్లోనే షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. ఆ తర్వాత కంపెనీ షేరు ధర రూ.141.75 స్థాయికి చేరుకుంది. ఐపీవో మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో 292 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. మూడవ రోజున అంటే నవంబర్ 9న Rox Hi-Tech Limited ఐపీవో మొత్తం 214.44 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. ఈ క్రమంలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగంలో 366.86 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.
నవంబర్ 7 నుంచి నవంబర్ 9 వరకు తెరచి ఉన్న ఐపీవోలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీనికోసం ఇన్వెస్టర్లు కనీసం రూ.1,32,800 వెచ్చించారు. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.13.12 కోట్లను సమీకరించింది. ఐపీవోలో కంపెనీ 60.18 లక్షల తాజా ఈక్విటీ షేర్లతో పాటు 5.47 లక్షల ఆఫర్ ఫర్ సేల్ షేర్లను విక్రయించింది. ఐపీవోకి ముందర ప్రమోటర్లు జిమ్ రాకేష్, సుకన్య రాకేష్ వాటా కంపెనీలో 83.29 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications