Richest Indian woman: దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 2021లో ఆమె నికర విలువ 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకుంది. రోష్ని నాడార్ మల్హోత్రా (40) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె.

ఫల్గుణి నాయర్ నికర విలువ..
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌ను విడిచిపెట్టి దాదాపు దశాబ్దం క్రితం బ్యూటీ బ్రాండ్ నైకాను ప్రారంభించారు ఫల్గుణి నాయర్. ప్రస్తుతం ఆమె నికర విలువ రూ.57,520 కోట్లుగా ఉంది. నిన్న విడుదలైన నివేదిక ప్రకారం.. 59 ఏళ్ల నాయర్ సంపద 2021లో 963 శాతం పెరిగింది. ప్రస్తుతం ఆమె దేశంలో రెండవ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. స్వీయ-నిర్మిత మహిళా సంపన్నుల జాబితాలో ఫల్గుణి ముందంజలో ఉన్నారు.

మరో మహిళా సంపన్నురాలు..
సమీక్షా కాలంలో బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్-షా నికర విలువ 21 శాతం క్షీణించి రూ.29,030 కోట్లకు చేరుకుంది. దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో మూడో స్థానంలో ప్రస్తుం ఆమె నిలిచింది.

పెరిగిన 100 మంది సంపద..
కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్-హురున్ జాబితాలో దేశంలో పుట్టి పెరిగిన 100 మంది మహిళలు తమ సొంత వ్యాపారాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. జాబితాలో చేర్చబడిన ఈ 100 మంది మహిళల మొత్తం ఆస్తులు 2020లో రూ.2.72 లక్షల కోట్ల నుంచి 2021లో రూ.4.16 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే ఈ సమయంలో దాదాపు 53 శాతం పెరిగాయి. ఈ మహిళలు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి రెండు శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.

ధనవంతులు అక్కడి నుంచి..
తాజా సంపన్నుల జాబితాలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన మహిళలు 25 మంది ఉన్నారు. ఆ తర్వాత ముంబై (21), హైదరాబాద్ (12) ఉన్నాయి. పరిశ్రమల గురించి మాట్లాడితే, భారతదేశంలోని టాప్ 100 మంది సంపన్న మహిళల్లో 12 మంది ఫార్మాస్యూటికల్ రంగం నుంచి, 11 మంది ఆరోగ్య సంరక్షణ రంగం నుంచి, 9 మంది వినియోగ వస్తువుల రంగం నుంచి ఉన్నారు.

చిన్న వయస్కురాలుగా కనికా..
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్‌కు చెందిన నలుగురు మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భోపాల్‌కు చెందిన జెట్‌సెట్‌గోకు చెందిన కనికా టేక్రివాల్ (33 ఏళ్లు) ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలు. ఈ జాబితాలో ముగ్గురు ప్రొఫెషనల్ మేనేజర్లు కూడా ఉన్నారు. పెప్సికోతో ఇంద్ర నూయి, హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన రేణు సూద్ కర్నాడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కి చెందిన శాంతి ఏకాంబరం ఈ జాబితాలో ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications