చేతులు కలిపిన రోల్స్ రాయిస్, ఇన్పోసిస్ : ఏరోస్పేస్ ఇంజనీరింగ్ & డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, పారిశ్రామిక సాంకేతిక సంస్థ రోల్స్ రాయిస్ జతకట్టాయి. సంయుక్తంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని బెంగళూరులో ప్రారంభించాయి. రోల్స్ రాయిస్ ఇంజనీరింగ్ అండ్ గ్రూప్ బిజినెస్ విభాగాలకు అవసరమైన అధునాతన డిజిటల్ తో కూడిన పరిశోధన, అభివృద్ధి సేవలను అందించేందుకు ఇది తోడ్పడనుందని తొత్పడుతోందని ఇన్పోసిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జస్మీత్ తెలిపారు. ఇరుసంస్థల మధ్య ఈ డీల్ ఏడేళ్ల పాటు కొనసాగనుందని వెల్లడించారు. ఇరు సంస్థలకు ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనకరమైనదని పేర్కొన్నారు.
భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏరోస్పేస్ రంగం పుంజుకుంటుందని రోల్స్ రాయిస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇన్పోసిస్ తో కలిసి ఏర్పాటు చేసిన ఈ జాయింట్ ఇన్నోవేషన్ సెంటర్ తమ గ్లోబల్ ఇంజనీరింగ్ ఎకోసిస్టమ్ ను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

రోల్స్ రాయిస్ సివిల్ ఏరోస్పేస్ వ్యాపారం కోసం ఇంజనీరింగ్, ఆర్అండ్ డీ సర్వీసుల కోసం ఇరు సంస్థలు డిసెంబర్ 2020లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగుళూరులో ఇరు సంస్థలు కలిసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశాయి. ఇది ఇన్పోసిన్, రోల్స్ రాయిస్ మధ్య దీర్ఘకాలిక సహకారానికి నిదర్శనమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications