కొండంత అప్పుల్లో Rich Dad Poor Dad రచయిత.. అలా జరిగితే బ్యాంకుల పని గోవిందా..
Robert Kiyosaki: రెండు దశాబ్ధాలకు పైగా చాలా మందిని ఆకర్షించిన ఏకైక పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఇది 1997లో బెస్ట్ సెల్లర్ పుస్తకంగా అవతరించింది. దీనికి రాబర్ట్ టి.కియోసాకి, షారన్ లెచ్టర్ సహ రచయితగా ఉన్నారు.
చిన్నతనం నుంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆర్థిక అక్షరాశ్యత చిన్నతనం నుంచి ఎంత ముఖ్యమనే అంశాలపై ఈ బుక్ ప్రధానంగా ప్రస్థావిస్తోంది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, వ్యాపార ప్రారంభం, యాజమాన్యం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం, సంపద సృష్టిని ప్రోత్సహిస్తుంది. ఇటీవలి కాలంలో సొంతంగా పెట్టుబడుల విషయంలో చాలా మంది చేసే అన్వేషనలకు ఈ పుస్తకంలో జవాబులు దొరుకుతాయి.

ప్రజలకు ఆర్థిక అంశాలపై అవగాహన కలిగించినప్పటికీ రచయిత రాబర్ట్ కియోసాకి దాదాపు 1.2 బిలియన్ డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోయినట్లు బహిర్గతం చేశారు. అయితే ఈ విషయం విన్న చాలా మంది ప్రస్తుతం షాక్ అవుతున్నారు. భారత కరెన్సీ లెక్కల ప్రకారం రచయిత అప్పుల విలువ రూ.10 వేల కోట్లకు సమానమైనదిగా ఉంది. చాలా మంది అప్పులు చేసి మరి ఆస్తులనే భ్రమలో అప్పులను కొనుగోలు చేస్తున్నారని కియోసాకి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. మనకు ఉండే ఆస్తులు, అప్పులకు మధ్య వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని నొక్కి చెప్పారు.
కియోసాకి బంగారాన్ని నిల్వ చేయడానికి ఎంచుకుంటాడు. తన లాభాలను వెండి, బంగారంగా మార్చుకుంటాడు. రచయిత కియోసాకి ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించినట్లు స్వేచ్ఛగా అంగీకరించారు. తాను పతనమైతే ఆ ప్రభావం బ్యాంకులపై పడుతుందని చెప్పారు. తనకు డాలర్ పై నమ్మకం లేదని గతంలో పతనమైన విషయాన్ని చెబుతూ కొంత మెుత్తాన్ని క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications