ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్, Rich Dad, Poor Dad పుస్తక ఆర్థిక రచయిత అయిన రాబర్ట్ కియోసాకి, ప్రపంచం అతిపెద్ద ఆర్థిక సంక్షోభానికి సిద్దమవుతోందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు గమనించడం చాలా అవసరం అని, ఈ సమయంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని కానీ ధరలు పడిపోయినప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలని ఆయన అంటున్నారు.

రాబర్ట్ కియోసాకి తన సోషల్ మీడియా పోస్ట్‌లో "బబుల్స్ త్వరలో పేలిపోనున్నాయి... బబుల్స్ పేలితే బంగారం, వెండి, బిట్‌కాయిన్ కూడా పడిపోతాయి. ఇది మంచిదే" అని పేర్కొన్నారు.
రాబర్ట్ కియోసాకి మాత్రం తరచూ అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా డాలర్ ముద్రణ విధానాన్ని ఆయన "ఫేక్ మనీ సిస్టమ్"గా అభివర్ణిస్తారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం ఎదుర్కొనే ప్రతి ఆర్థిక సంక్షోభానికీ పరిష్కారం ముద్రణ డబ్బు ద్వారా తప్ప మరేదీ కాదు అని అన్నారు. 1987లో జరిగిన స్టాక్ మార్కెట్ పతనం, 1998లో LTCM సంక్షోభం, 2019లోని రెపో మార్కెట్ సంక్షోభం, 2020లో COVID-19 తర్వాత తలెత్తిన ఆర్థిక గందరగోళం, 2023-24లో బ్యాంకింగ్ రంగంలోని SVB పతనం వంటి అన్ని పరిణామాలనూ ఆయన ఒకే కోణంలో చూస్తారు అవన్నీ ముద్రిత డబ్బుపై ఆధారపడే విధానాలే ద్రవ రూపంలో బలహీనతకు కారణమవుతాయన్నదే ఆయన నమ్మకం. ఈ విధానం కారణంగానే డాలర్ విలువ తగ్గిపొతోందని, ఇది అమెరికాను "అత్యధిక అప్పు దేశంగా" మార్చిందని ఆయన ఆరోపిస్తున్నారు.
రాబర్ట్ కియోసాకి భావన ప్రకారం, ఈ ఆస్తులూ (బంగారం, వెండి, బిట్‌కాయిన్) కూడా ఇంకొన్నాళ్లలో పడిపోయే అవకాశం ఉంది. కానీ అదే మంచి అవకాశం అని ఆయన చెబుతున్నారు.
ఫియాట్ కరెన్సీ అంటే ప్రభుత్వాలు ముద్రించే డబ్బును "నకిలీ డబ్బు"గా తీవ్రంగా విమర్శించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల పొదుపు విలువ తగ్గిపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తరచూ "సేవర్లు లూజర్లు" (Savers are losers) అనే వ్యాఖ్యను గుర్తు చేస్తూ, డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేయడం వల్ల ప్రయోజనం ఏమీలేదని, దాని విలువ కాలక్రమంలో తగ్గుతుందని వ్యాఖ్యానించారు. స్థిరమైన సంపదను నిర్మించాలంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి హార్డ్ అసెట్స్‌లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని ఆయన సూచిస్తున్నారు.
2025లో ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ కుప్పకూలిపోతుందని, ఇది ఇప్పటివరకు జరిగినదాని కంటే పెద్దదిగా ఉంటుందని ఆయన అంచనా. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బాండ్లు అన్నింటికీ భారీ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. జీతంపై ఆధారపడేవారు, ఉద్యోగాలు కోల్పోవడం, ఇళ్ళు, పెట్టుబడులు విలువ కోల్పోవడం జరగవచ్చని తెలిపారు
ఇది సంక్షోభమా లేక అవకాశమా?
కియోసాకి చెప్పే విధంగా, ఇది భయపడాల్సిన పని కాదు కానీ ఇది ఒక మంచి సిద్దమయ్యే సమయం ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి అవకాశం. ప్రస్తుతం ధరలు పడిపోతే బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనాలని ఆయన సూచిస్తున్నారు.
అంతేకాకుండా, వారెన్ బఫెట్ ఉదాహరణ ఇచ్చారు. బఫెట్ ఇప్పుడు స్టాక్స్ కోనడం మానేసి, దాదాపు $350 బిలియన్ నగదు నిల్వ ఉంచారని తెలిపారు. ఈ సంక్షోభం వచ్చిన తరువాత, మంచి అసెట్స్‌ను తక్కువ ధరలకు కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఆయన చెబుతున్న సందేశం ఏంటంటే నగదుపై పూర్తిగా ఆధారపడకూడదు, ఎందుకంటే అది వేగంగా తన విలువను కోల్పోతూ పోతుంది. ద్రవ్యోల్బణం, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక విధానాల వలన ఫియాట్ కరెన్సీ పటిష్టంగా నిలబడలేకపోతోందని ఆయన అభిప్రాయం. "భయపడకండి, ప్లాన్ చేయండి" అన్నదే ఆయన సందేశం అంటే భయంతో కాకుండా వ్యూహాత్మకంగా ఆలోచించి, భవిష్యత్తులో విలువ పెరుగే ఆసెట్లను తక్కువ ధరలకు పొందేందుకు సిద్ధమవ్వాలి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications