బంగారం, బిట్‌కాయిన్ దూసుకెళ్తున్నాయి… కానీ రాబర్ట్ కియోసాకి చెబుతున్నట్టు ఏ వర్గాలు ప్రమాదంలో ఉన్నాయి?
అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ పై ప్రసిద్ధ రచయిత "రాబర్ట్ కియోసాకి" ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరగడం మంచి ఆర్థిక పరిస్థితుల వల్ల కాదని అసలు ఇది సిస్టమ్ కూలిపోతుందనే సంకేతం అని ఆయన హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని బేబీ బూమర్ తరం(1946-1964లో జన్మించిన వారు) ఈ సంక్షోభానికి ఎక్కువగా బలవుతారని కియోసాకి స్పష్టం చేశారు.
కియోసాకి X లో ఇలా రాశారు, "రిచ్ గెట్ రిచర్, కానీ ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మరింత ఇబ్బందిలోకి తొస్తుంది" అంటే పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కువగా జీతాల పై లేదా స్థిరమైన ఆదాయాల పై ఆధారపడి జీవిస్తారు. ఇన్‌ఫ్లేషన్ పెరిగినప్పుడు రోజువారీ అవసరాలైన వస్తువుల ధరలు పెరుగుతాయి. కానీ వారి ఆదాయం మాత్రం అంతగా పెరగదు. దీంతో జీవితం మరింత కఠినమవుతుంది.

బంగారం, బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్నా అది మంచి వార్త కాదని, ప్రభుత్వాలు ముద్రిస్తున్న "ఫియాట్ మనీ" అంటే నకిలీ డబ్బు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను ఇది నెమ్మదిగా కొరుక్కుంటుందని హెచ్చరించారు. అందుకే ప్రజలు తమ పొదుపులను "బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం" లాంటి "రియల్ మనీ"లో ఉంచాలని ఆయన సూచించారు.
ఇటీవల అక్టోబర్‌లో బంగారం ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర ఒక ఔన్సుకు $4,250 దాటగా, భారత మార్కెట్లో 10 గ్రాములకు రూ. 13,277 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 56% పెరుగుదల. వెండి ధరలు కూడా కొంతకాలం వేగంగా పెరిగి, తర్వాత స్వల్పంగా తగ్గాయి. మరోవైపు బిట్‌కాయిన్ మాత్రం నెల మధ్యలో $121,000 నుండి $108,000 వరకు పడిపోయింది. దీనికి మార్కెట్‌లో ఉన్న మార్కెట్ గందరగోళం పరిస్థితులు మరియు ETFల నుండి వచ్చిన భారీగా నిధుల ఉపసంహరణలు (outflows) కారణమని చెబుతున్నారు.
కియోసాకి విమర్శలు కేవలం మార్కెట్ గురించి మాత్రమే కాదు. ఒక పోడ్‌కాస్ట్‌లో ఆయన, అమెరికాలో గృహ రహితుల సమస్యకు కారణం ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పారు. ఆయన చెప్పారు, "హోంలెస్‌నెస్ ఉన్న కారణం ఫెడరల్ రిజర్వ్. ఇది ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తున్న ఒక సమస్యాత్మక సంస్థ. ప్రజలు ఇళ్లు కొనలే పరిస్థితి వచ్చిందట." అలాగే, అమెరికా డాలర్ నోట్లు చూపిస్తూ ఆయన అన్నారు, "ప్రభుత్వం నకిలీ డబ్బు ముద్రిస్తే, సాధారణ ప్రజల జీవితం మరింత కష్టం అవుతుంది."
1947లో జన్మించిన కియోసాకి, తన తరానికి చెందిన బేబీ బూమర్స్ ఇన్‌ఫ్లేషన్ వల్ల పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మేమంతా ఇన్‌ఫ్లేషన్ వల్ల వైప్ అవుతాం. మీ అమ్మా నాన్న వీధుల్లోకి రావాల్సి రావచ్చు, ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ వాళ్ల సోషల్ సెక్యూరిటీని కూడా తుడిచేస్తుంది, అని ఆయన అన్నారు. ఇన్‌ఫ్లేషన్ వల్ల ఆస్తులు ఉన్నవారికి లాభం వస్తుంది. కానీ జీతాల పై, పెన్షన్ లేదా స్థిరమైన ఆదాయాల పై ఆధారపడినవారికి మాత్రం పరిస్థితి మరింత కఠినమవుతుంది. సాధారణ ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇన్‌ఫ్లేషన్ వారిని నాశనం చేస్తుంది," అని ఆయన వ్యాఖ్యానించారు.
కియోసాకి మాటల్లో బంగారం, బిట్‌కాయిన్ ధరల పెరుగుదల అంతా బాగుంది అనిపించినా, అది వ్యవస్థలో లోతైన సమస్యలకు సంకేతం. ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతికి తీవ్రమైన ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. అందుకే ఆయన "నిజమైన డబ్బు"లోనే పొదుపులు పెట్టుకోమని చెబుతున్నారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వీటిలో దేనిలోనైనా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి కొన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి.


Click it and Unblock the Notifications