ప్రపంచ ప్రఖ్యాత రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి అమెరికా డాలర్ (US Dollar) భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు చేశారు. తన పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన కియోసాకి.. డాలర్ స్థిరత్వం గురించి పదేపదే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆయన 'ఎక్స్' (X) ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ.. BRICS దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) బంగారం మద్దతుతో "యూనిట్" అనే కొత్త "డబ్బు"ను ప్రకటించాయనే వార్తను ప్రస్తావించారు. దీని ఆధారంగా, "బై బై యూఎస్ డాలర్" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
డాలర్ పొదుపు చేసేవారే నష్టపోతారు!
రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్స్ ను అప్రమత్తం చేస్తూ.. అధిక ద్రవ్యోల్బణం (Hyperinflation) కారణంగా డాలర్‌ను పొదుపు చేసేవారు అత్యంత నష్టపరులు అవుతారని హెచ్చరించారు. డాలర్ విలువ క్షీణత నుంచి తమ ఆస్తులను రక్షించుకోవడానికి ఆయన ఒక 'మంత్రం' చెప్పారు.
"నేను నా మంత్రానికి కట్టుబడి ఉన్నాను, బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథర్‌లను కలిగి ఉన్నాను. మీరు యూఎస్ డాలర్లను కలిగి ఉంటే... అధిక ద్రవ్యోల్బణం మిమ్మల్ని తుడిచిపెట్టవచ్చు." అని ఆయన పోస్ట్ చేశారు. అంటే బంగారం, వెండి వంటివే ఆయన మంత్రాలన్న మాట. దీర్ఘకాలంగా బంగారం, వెండిపై పెట్టుబడులను ప్రోత్సహించిన కియోసాకి, ఇటీవల సంవత్సరాలలో బిట్‌కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టో ఆస్తులను ప్రమోట్ చేస్తున్నారు.
BRICS కరెన్సీ నిజమేనా?
కియోసాకి ప్రకటించినట్లుగా.. BRICS దేశాలు అధికారికంగా బంగారం మద్దతుతో కొత్త కరెన్సీని (UNIT) ప్రవేశపెట్టలేదు. దీనిపై పుకార్లు ఉన్నప్పటికీ.. BRICS సీనియర్ అధికారులు వెంటనే అలాంటి కరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. డాలర్ ఆధిపత్యం లేకుండా వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గోల్డ్ లింక్డ్ పేమెంట్ మెకానిజంని అభివృద్ధి గురించి BRICS దేశాల మధ్య ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.
డాలర్ పై పుతిన్ ఇలా..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా డాలర్ గురించి మాట్లాడుతూ తమ లక్ష్యం డాలర్‌ను తిరస్కరించడం కాదని, కానీ డాలర్‌ను ఆయుధంగా మార్చడాన్ని (Weaponization) అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. స్థానిక కరెన్సీల నెట్‌వర్క్‌ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను నిర్మించడంపైనే తమ దృష్టి ఉందని ఆయన తెలిపారు. ఉమ్మడి కరెన్సీ విషయంలో తొందరపడటం "తీవ్రమైన తప్పులకు" దారితీయవచ్చని, యూరో ఉదాహరణను ఉటంకిస్తూ పుతిన్ హెచ్చరించారు.
కియోసాకి అంచనాలు
రాబర్ట్ కియోసాకి గతంలోనూ చాలా సార్లు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆయన ఎప్పుడూ అమెరికా ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన పతనాన్ని అంచనా వేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాలు (Monetary Policies), ప్రభుత్వం అపరిమితంగా డబ్బు ముద్రించడం వల్ల డాలర్ విలువ పడిపోతుందని ఆయన తరచుగా హెచ్చరిస్తారు. ఇటీవలి నెలల్లో, కియోసాకి వెండిని "అత్యుత్తమైన, సురక్షితమైన" పెట్టుబడి ఎంపికగా పదేపదే పేర్కొన్నారు. డాలర్ ఆధారిత ద్రవ్య అనిశ్చితిని ఎదుర్కోవడానికి క్రిప్టో ఆస్తులు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన అంచనాలు కొన్నిసార్లు వాస్తవాల కంటే వేగంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతుంటారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications