Robert Kiyosaki: బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టండి.. అవే మిమ్మల్ని కాపాడుతాయి..!
ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన బంగారం, వెండి, బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా పోస్టులు చేస్తుంటారు. ఆయన ఎక్కువగా బంగారం ప్రాముఖ్యతను వివరిస్తుంటారు. తాజాగా కియోసాకి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆయన తను కొనుగోలు చేసిన బంగారం ఇంటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఆ ఇచ్చి విలవు 4.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.40 కోట్లు పైగా ఉంటుందని తెలిపారు. అయితే ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి వినియోగించిన పసిడిని అప్పట్లో కేవలం 4.5 లక్షల డాలర్లకే కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు.
దీని ప్రకారం తాను 4.5 లక్షల డాలర్లకే కొన్న బంగారంతో ఇప్పుడు 45 లక్షల డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశానని వివరించారు. బంగారం విలువ ఎంతలా పెరిగిందో ఆయన ఇలా వివరించారు.
ఇది ఎలాంటి ఫోర్‌క్లోజర్ లేదా ప్రత్యేక డీల్ కాదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా తాను బంగారు నాణేలను పొదుపు చేస్తూ వచ్చానని, వాటి విలువ పెరగడంతో చివరకు ఆ బంగారాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగించానని తెలిపారు. ప్రస్తుతం వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ఉన్నాయని రాబర్ట్ కియోసాకి తెలిపారు. అయితే తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక డాలర్ ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

సంప్రదాయ కరెన్సీపై ఆధారపడటానికి బదులుగా బంగారం, వెండి వంటి విలువైన ఆస్తులను కూడబెట్టుకోవడంపై మంచిదని చెబుతున్నారు. బ్యాంకులో డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం వంటి సంప్రదాయ ఆర్థిక సలహాలుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం వల్ల దాని విలువ క్రమంగా తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు. కాగితపు డబ్బు విలువను కోల్పోతున్న సమయంలో బంగారం, వెండి వంటి 'రియల్ మనీ', రియల్ అసెట్స్‌లో పొదుపు చేయడం మేలు చేస్తుందని వివరించారు. తాను ఏళ్లుగా బంగారాన్ని పొదుపు చేయడం వల్లే దాన్ని ఉపయోగించి భారీ విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలిగానని కియోసాకి వివరించారు. బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.
కాగా గత సంవత్సరం కాలంగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆగస్ట్ నెలలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. అయితే పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications