Robert Kiyosaki: డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు.. వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం..!
రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్స్ కు ఎప్పుడు ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటాడు. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి.. ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎందుకు పెట్టుబడి పెట్టాలని వివరిస్తారు. ఆయన ఎక్కువ బంగారం, వెండి, బిట్ కాయిన్స్ సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే ఆయన ఈ మధ్య రాగి లోహానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో రాగికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కు సంబంధించి కూడా ఆయన సలహాలు ఇచ్చారు. డబ్బు సంపాదించడం కాదు.. దాన్ని సరైన ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
తాజాగా బ్యాంకులు, రుణాలు, పెట్టుబడుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డబ్బును కేవలం దాచుకోవడం కంటే, అది మన కోసం పనిచేసేలా చేయడం ముఖ్యమని రాబర్ట్ కియోసాకి తెలిపారు. మనం బ్యాంకులో డబ్బులు జమ చేస్తే.. అది అక్కడే స్థిరంగా ఉండదని ఆయన గుర్తు చేశారు. బ్యాంకులు ఆ డిపాజిట్లలో కొంత భాగాన్ని లోన్స్ రూపంలో ఇతరులకు ఇస్తాయని చెప్పారు. మన డబ్బు బ్యాంకింగ్ వ్యవస్థలో తిరుగుతూ ఉంటుందని గుర్తు ఉంచుకోవాలని చెప్పారు. ఆ డబ్బు ద్వారా వచ్చే లాభాల్లో ప్రధాన ప్రయోజనం బ్యాంకులకు ఉంటుందని వివరించారు.

సాధారణంగా పూర్ డాడ్ డబ్బును భద్రంగా దాచుకోవడంపై దృష్టి పెడతాడని... రిచ్ డాడ్ డబ్బును ఉపయోగించి మరిన్ని ఆస్తులను సృష్టించుకోవాలని చూసే వ్యక్తి అని రాబర్ట్ కియోసాకి వివరించారు. ఒకరు బ్యాంకులో డబ్బు ఉంచితే.. మరొకరు డబ్బును ఉపయోగించి వ్యాపారాలు లేదా ఆస్తుల్లో పెట్టుబడులుగా పెడతారని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు డిపాజిట్లను ఉపయోగించి లోన్స్ ఇస్తాయని... లోన్స్ ద్వారా వచ్చే వడ్డీతో బ్యాంకులు ఆదాయం పొందుతాయని వివరించారు. అదే సమయంలో డిపాజిటర్లకు కూడా కొంత వడ్డీ చెల్లిస్తాయని గుర్తు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న సాధారణ బ్యాంకింగ్ విధానమని కియోసాకి పేర్కొన్నారు.
ఒక తెలివైన పెట్టుబడిదారు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలని సూచించారు. ఆ ఆస్తి ఆదాయం ఎలా ఇస్తుంది?, దాని విలువకు ఆధారం ఏమిటి? అని తెలుసుకోవాలన్నారు. కేవలం ఎవరో చెప్పారని లేదా ధర పెరుగుతుందని ఆశతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఆయన చెబుతారు.పెట్టుబడి పెట్టే ముందు పూర్తి అవగాహన, రిస్క్ అంచనా, సరైన ప్రణాళిక అవసరమని ఆయన స్పష్టం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications