రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గంభీరమైన హెచ్చరిక జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచం మరోసారి భారీ మార్కెట్ క్రాష్ ను ఎదుర్కోబోతోంది. అయితే ఈసారి ఆయన భయంతో ఆస్తులను అమ్మడం కాకుండా..బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.
కియోసాకి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (మునుపటి ట్విట్టర్)లో మాట్లాడుతూ.. అమెరికా ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్ నకిలీ డబ్బు ముద్రిస్తున్నాయని ఆరోపించారు. ఆయన ప్రకారం ఈ విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుంది. నకిలీ డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు నిజమైన డబ్బు కనుమరుగవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

కియోసాకి ప్రకారం 2026 నాటికి బంగారం ధర 27 వేల డాలర్ల వరకు చేరుతుంది. ఇదే సమయంలో బిట్‌కాయిన్ ధర 250,000 డాలర్లకు చేరుతుందని ఆయన ధైర్యంగా ప్రకటించారు. ఈ అంచనాను ఆయన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ సలహాపై ఆధారపడి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అమెరికా డాలర్‌ను బంగారం ప్రమాణం నుండి తొలగించినప్పటి నుండి బంగారంపై తన నమ్మకం పెరిగిందని ఆయన చెప్పారు. అప్పటినుంచే నేను బంగారం కొనడం ప్రారంభించానని ఆయన తెలిపారు.
కియోసాకి ప్రకారం వెండి ధర 2026 నాటికి ఔన్స్‌కు 100 డాలర్లకు చేరుతుంది. ఆయనకు వెండి గనులు ఉన్నాయని, సరఫరా తక్కువగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎథెరియం ధర 60 డాలర్లకు చేరుతుందని ఆయన అన్నారు. ఈ అంచనాను టామ్ లీ అనే క్రిప్టో మార్కెట్ విశ్లేషకుడి నుండి పొందినట్లు ఆయన వెల్లడించారు.
బంగారం ధరలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
రాబర్ట్ కియోసాకి ప్రకారం.. అమెరికా ప్రభుత్వం, ఫెడ్ ఆర్థిక నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. వారు తమ బిల్లులు చెల్లించడానికి నకిలీ డబ్బు ముద్రిస్తారు. మీరు లేదా నేను అలా చేస్తే జైలులో ఉంటామని ఆయన అన్నారు. అమెరికా ఇప్పుడు చరిత్రలోనే అత్యధిక రుణగ్రస్త దేశంగా మారిందని ఆయన హెచ్చరించారు. అందుకే నేను ఎప్పటికప్పుడు పొదుపుదారులు నష్టపోతారని చెబుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కియోసాకి నుండి వచ్చిన మొదటి హెచ్చరిక కాదు. గతంలో కూడా ఆయన పలు సార్లు ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను ముందుగా అంచనా వేశారు. ఆయన నమ్మకం ప్రకారం.. ప్రతి ఆర్థిక పతనం భయపడాల్సిన సమయం కాదు. కొనుగోలు చేసే అవకాశం అని అన్నారు. కియోసాకి వాదన ప్రకారం.. ప్రభుత్వాలు నిరంతరం కొత్త కరెన్సీ ముద్రించడం వల్ల డబ్బు విలువ తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పరిమిత వనరులు మాత్రమే నిజమైన ఆర్థిక భద్రతను అందిస్తాయని Robert Kiyosaki అభిప్రాయపడుతున్నారు.
ఆయన తాజా అంచనాలు బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులకు గణనీయమైన పెరుగుదల సూచిస్తున్నాయి. అయితే విమర్శకులు ఆయన అంచనాలను అతిశయోక్తిగా భావిస్తున్నారు. కానీ కియోసాకి మాత్రం తన నిర్ణయంపై అచంచలంగా ఉన్నారు. ఫేక్ మనీ సిస్టమ్ కూలిపోతుంది, రియల్ ఆస్తులు మాత్రమే నిలుస్తాయని ఆయన పదే పదే స్పష్టం చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే కియోసాకి మాటల్లో ఒక హెచ్చరిక, ఒక అవకాశం రెండూ ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం తగ్గిన సమయంలో, అరుదైన విలువైన ఆస్తుల వైపు దృష్టి పెట్టే సమయం ఇదేనని ఆయన సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications