ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నా ధనవంతులు కావొచ్చు.. రాబర్ట్ కియోసాకి కీలక సూచన ఇదే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒకదాని తరువాత ఒకటి కుదేలవుతున్న తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన బలమైన హెచ్చరికను, అదే సమయంలో శక్తివంతమైన సంపద సూత్రాన్ని పంచుకున్నారు. తన తాజా X (మునుపటి ట్విట్టర్) పోస్ట్‌లో ఆయన ఆర్థిక పతనాలు అంటే పెట్టుబడిదారులకు నష్టకాలం కాదని చెప్పుకొచ్చారు. అవే నిజానికి ధనవంతులు కావడానికి ఉత్తమ సమయమని స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపు మూడు ప్రధాన ఆర్థిక మాంద్యాలను దాటి వచ్చిన అనుభవంతో, ప్రతి సంక్షోభం ముగిసే సరికి తాను మరింత ధనవంతుడిగా బయటపడ్డానని ఆయన తెలిపారు.
మీరు ధనవంతులు కావడానికి కష్టపడుతున్నారా? లేక నిజంగా సంపన్నులు కావడానికి కష్టపడుతున్నారా?" అనే దానితో తన పోస్టు ప్రారంభించిన ఆయన.. ఈ రెండు పదాల మధ్య ఉండే పెద్ద తేడాను చాలా సులభంగా అర్థమయ్యేలా వివరించారు. డబ్బు ఎక్కువగా సంపాదించే వారు ధనవంతులు, కానీ సంపద అంటే డబ్బు కాదు..సమయం అని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి వెంటనే పని ఆపితే, అతను ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఆదాయం లేకుండా జీవించగలడో అదే అసలు సంపద అని ఆయన చెప్పారు. ఉదాహరణగా నా బ్యాంకులో $1 మిలియన్ ఉందని చెప్పే వారు ధనవంతులు మాత్రమే. కానీ నిజమైన సంపన్నుడు ఈరోజు పని ఆపేస్తే, నా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నన్ను ఏడు నెలలు సునాయాసంగా జీవింపజేస్తుందని చెప్పగలగాలి అని ఆయన వివరించారు.

కియోసాకి ప్రకారం ఇకపోతే ఆర్థిక మాంద్యాలు ఎందుకు గొప్ప అవకాశాలు అంటే.. మాంద్యం సమయంలో ఆస్తుల ధరలు భారీగా పడిపోతాయి. రియల్ ఎస్టేట్, అద్దె ఇళ్లు, విలువైన లోహాలు, డిజిటల్ ఆస్తులు వంటి పెట్టుబడులకు ఇది బంగారు సమయం. ఇతరులు భయంతో అమ్ముకుంటుంటే, తెలివైన పెట్టుబడిదారులు అప్పుడు కొనుగోలు చేస్తారు. మార్కెట్ పతనాల్లో తాను కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించానని, నగదు ప్రవాహాన్ని ఇచ్చే ఆస్తులను కొనడం వల్ల తన సంపద క్షీణించలేదు, మరింతగా పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఆర్థిక పతనంలో ఏం చేయాలో అనే ప్రశ్నకు ఆయన సులభమైంగా ఉండి శక్తివంతమైన సమాధానం ఇచ్చారు. ఇప్పుడే ప్లాన్ చేయండి. గ్లోబల్ ఎకానమీ త్వరలో భారీ ఒత్తిడిని చూడబోతుందని, అందుకు సిద్ధంగా ఉన్నవారే విజేతలుగా బయటపడతారని ఆయన హెచ్చరించారు. గతంలో చేసిన మరో పోస్ట్‌ను గుర్తుచేస్తూ,.. నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారాలను ప్రారంభించడం, బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి అసలు ఆస్తులను కొనుగోలు చేయడం వంటి సూచనలను కూడా ఆయన మళ్లీ గుర్తు చేశారు.
నవంబర్‌లో ఆయన చేసిన అంచనా ప్రకారం.. చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక క్రాష్ ఇప్పటికే ప్రారంభమైందని.. కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎందుకంటే సిద్ధంగా ఉన్న వాళ్లకు ఇది జీవితంలో ఒకే సారి వచ్చే సంపద నిర్మాణ అవకాశం అని అన్నారు. సంక్షోభం అనేది ప్రమాదం మాత్రమే కాదు, అవకాశం కూడా. భయపడేవారు నష్టపోతారు, సిద్ధపడేవారు ధనవంతులు అవుతారని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications