Robert Kiosaki: భారీ ఆర్థిక సంక్షోభం రాబోతోందా? మార్కెట్ క్రాష్‌ను సంపదగా మార్చుకునే స్ట్రాటజీ ఇదే!

ప్రముఖ పెట్టుబడిదారుడు , 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి (robert kiyosaki) మరోసారి ప్రపంచ మార్కెట్లను తన అంచనాలతో ఉలిక్కిపడేలా చేశారు. 2026 , 2027 మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక "భారీ పతనం" (Giant Crash) రాబోతోందని, అది 1930ల నాటి 'గ్రేట్ డిప్రెషన్'ను తలపిస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే, ఆయన ఈ హెచ్చరికను భయపెట్టడానికి కాకుండా, తెలివైన ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా అభివర్ణిస్తున్నారు.

Robert Kiyosaki Predicts Giant Market Crash In 2026 27 Great Depression Strategy And Predictions

క్రాష్ అంటే నష్టం కాదు.. ఒక డిస్కౌంట్ సేల్!

రాబర్ట్ కియోసాకి ఫిలాసఫీ ప్రకారం, మార్కెట్ పడిపోవడం అనేది విపత్తు కాదు, అది ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసే ఒక అరుదైన అవకాశం. "1987, 2000, 2008, 2015, 2019 , 2022లో మార్కెట్లు కుప్పకూలినప్పుడు నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను" అని ఆయన పేర్కొన్నారు. అందరూ భయపడి ఆస్తులను అమ్మేస్తున్నప్పుడు, ధైర్యంగా కొనుగోలు చేసేవారే భవిష్యత్తులో బిలియనీర్లు అవుతారని ఆయన నమ్ముతారు.

కియోసాకి 'క్రాష్ స్ట్రాటజీ' ఏంటి?

  1. ముందుగానే సిద్ధమవ్వండి: మార్కెట్ పడిపోయినప్పుడు చేతిలో నగదు (Liquidity) ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి ఆస్తులను తక్కువ ధరకు దక్కించుకోగలం.
  2. భయపడకండి: మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు చాలామంది భయంతో స్తంభించిపోతారు. కానీ కియోసాకి ప్రకారం, సంక్షోభం సమయంలోనే రియల్ ఎస్టేట్, స్టాక్స్ , కమోడిటీలు భారీ డిస్కౌంట్‌కు లభిస్తాయి.
  3. నైపుణ్యం పెంచుకోండి: కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా, మార్కెట్ సైకిల్స్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం.

బంగారం, వెండి , బిట్‌కాయిన్‌పై సంచలన అంచనాలు

సంక్షోభం తర్వాత ఆస్తుల ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయని రాబర్ట్ కియోసాకి (robert kiyosaki) అంచనా వేస్తున్నారు. ఆయన లెక్కల ప్రకారం..

  • బంగారం (Gold): ఒక ఔన్స్ బంగారం ధర 35,000 డాలర్లకు (సుమారు రూ. 29 లక్షలు) చేరవచ్చు.
  • వెండి (Silver): ఒక ఔన్స్ వెండి ధర 200 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
  • బిట్‌కాయిన్ (Bitcoin): దీని ధర ఏకంగా 7,50,000 డాలర్లకు (సుమారు రూ. 6.2 కోట్లు) , ఎథీరియం 95,000 డాలర్లకు పెరగవచ్చని ఆయన జోస్యం చెప్పారు.

ఎవరీ రాబర్ట్ కియోసాకి?

రాబర్ట్ కియోసాకి ఒక అమెరికన్ పారిశ్రామికవేత్త , రచయిత. ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తకం ఆర్థిక అక్షరాస్యతలో ఒక మైలురాయిగా నిలిచింది. కేవలం ఉద్యోగం మీద ఆధారపడకుండా, వ్యాపారాలు , రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను (Assets) సృష్టించుకోవాలని ఆయన దశాబ్దాలుగా బోధిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరగడం , కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల ఈ భారీ పతనం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. మరి మీరు ఈ 'మహా సంక్షోభం' కోసం సిద్ధంగా ఉన్నారా? కియోసాకి చెప్పినట్లు నష్టపోయే వాళ్లుగా అవుతారా? లేక అదృష్టవంతులు అవుతారా? అనేది మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+