Robert Kiyosaki On Gold: బంగారాన్ని తొందరపడి కొనుగోలు చేయకండి.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక..
ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఎక్కువ పెట్టుబడి, లాభాల గురించి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా బంగారం, వెండి ధరలపై ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. బంగారం ధరల తగ్గుదలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పసిడి ధర పతనమవుతున్న సమయంలో కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎప్పుడైతే బంగారం ధరలో స్థిరత కనిపిస్తోందో అప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచించారు. వెండి విషయంలో కూడా అలానే ముందుకెళ్లాలని కోరాడు. బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవడం కంటే.. బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన అంచనా వేశారు.
అయితే ఇది అందరికి సాధ్యం కాదు కాబట్టి.. బంగారం ధర తగ్గినప్పుడు పెట్టుబడి పెట్టడం తెలివైన ఆలోచనగా చెబుతున్నారు. ఎప్పుడైన పెట్టుబడి పెట్టేటప్పుడు తక్కువలో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాలి. ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకోవాలనే సూత్రాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఏదైనా అస్థిరంగా ఉన్నప్పుడు దానిపై పెట్టుబడి పెట్టడం కింద పడిపోతున్న కత్తిని పట్టుకుంటున్నట్లే అని ఆయన వివరించారు. బంగారం, వెండి ధరల తగ్గుదలకు ఫెడ్ తోనే సమస్య మొదలవుతుందని రాబర్ట్ కియోసాకి చెప్పారు. బ్లాక్‌రాక్ వంటి ప్రపంచంలోని పెట్టుబడి బ్యాంకులు, మన డబ్బు ద్వారా మన సంపదను దోచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్రిలియన్ అంటే 1 తర్వాత 12 సున్నాలు ఉండటమన్నారు. 1,000,000,000,000 అమెరికా డాలర్లు ప్రతి 90 రోజులకు 1 ట్రిలియన్ డాలర్లను ముద్రిస్తోందని పేర్కొన్నారు. క్వాడ్రిలియన్ అంటే 1 తర్వాత 15 సున్నాలు ఉండటమని.. డెరివేటివ్స్ మార్కెట్‌ను క్వాడ్రిలియన్లలో కొలుస్తారని విరించారు. 2008లో 'సబ్-ప్రైమ్ మార్ట్‌గేజ్' డెరివేటివ్స్ మార్కెట్ కుప్పకూలినప్పుడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు దానితో పాటే పతనమైందని గుర్తు చేశారు. రాబోయే పతనం 2008 నాటి దానికంటే చాలా పెద్దదని రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. బహుశా అది ఒక ప్రపంచ ఆర్థిక మాంద్యం కావచ్చని అంచనా వేశారు.
బంగారాన్ని భద్రంగా దాచుకోవడం సంపదను కాపాడితే.. బంగారు గని ఆదాయాన్ని అందిస్తుందని కియోసాకి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రైవేటు బంగారు గనుల్లో ఒక ఔన్స్ బంగారాన్ని వెలికితీసేందుకు సుమారు 1,500 డాలర్లు ఖర్చవుతోందని చెప్పారు. మార్కెట్‌లో ఔన్స్ ధర 3,713 డాలర్లుగా ఉన్నందున, ఖర్చులు మినహాయించకముందే ఒక్కో ఔన్స్‌పై 2,200 డాలర్లకు పైగా వ్యత్యాసం ఉంటుందని తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications