Robert Kiyosaki: బంగారం ధర ఇంకా పెరుగుతుందా.. రాబర్ట్ కియోసాకి ఏమన్నారు..!
బంగారం ధరల పెరుగుదలపై ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి స్పందించారు. అమెరికా డాలర్ విలువ, బంగారం ధరలపై విశ్లేషించారు. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం ప్రమాణాన్ని (గోల్డ్ స్టాండర్డ్) నిలిపివేసిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి డాలర్ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు. 1971లో ఒక ఔన్స్ బంగారం విలువ 35 డాలర్లు ఉండేదని తెలిపారు. కానీ ఇప్పుడు ధర అతి భారీగా పెరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4,342 డాలర్లకు చేరిందన్నారు.
పసిడి ధర 124 రెట్లు పెరిగిందన్నారు. అయితే ఇది బంగారం విలువ పెరగడం కంటే.. డాలర్ కొనుగోలు శక్తి భారీగా క్షీణించడాన్ని సూచిస్తోందని రాబర్ట్ కియోసాకి విశ్లేషించారు. రిచ్ డాడ్ తనకు 21 ఏళ్ల వయసులో డాలర్ గురించి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిక్సన్ ఒక్క రాత్రిలో డాలర్‌ను విలువ తగ్గించలేదని, అప్పటికే దాని విలువ తగ్గిపోయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ పరిణామాలను గమనించిన వారు భూములు, చమురు, గనులు వంటి హార్డ్ అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఇతరులు బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసి కొనుగోలు శక్తిని కోల్పోయారని తెలిపారు. బంగారం ధర పెరగడంపై అందరూ చర్చించుకుంటున్నారని.. కానీ పసిడిలో పెట్టుబడి పెట్టేవారు చాలా తక్కువ మందేనని వివరించారు.

నాణేలు లేదా గోల్డ్ ఆధారిత పెట్టుబడి సాధనాల కంటే బంగారం ఉత్పత్తి చేసే గనుల్లో యాజమాన్య వాటా కలిగి ఉండటమే మంచిదనిసూచించాారు. నాలుగు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగారం, వెండి మైనింగ్ కంపెనీలో ప్రీ-పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్లు వివరించారు. కొలరాడో, ఘనా, దక్షిణాఫ్రికా, పపువా న్యూ గినియాలో కార్యకలాపాలు ఉన్నట్లు రాబర్ట్ కియోసాకి చెప్పారు. ఈ ప్రైవేట్ రౌండ్‌లో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులు సమీకరించారని తెలిపారు. తదుపరి అవకాశం ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని కియోసాకి పేర్కొన్నారు.
బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డాలర్ విలువ బలహీనపడితే పసిడి ధర పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వెండి, రాగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications