"రిచ్ డాడ్ పూర్ డాడ్" రచయిత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సంచలన హెచ్చరిక చేశారు. అమెరికా, యూరప్, ఆసియాలలో "చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం" ఇప్పటికే మొదలైందని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ సమయంలో మీ డబ్బుని ఎలా కాపాడుకోవాలో కూడా సలహా ఇచ్చారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
మార్కెట్లో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ మాంద్యం (Recession) కాదని, ఇది చాలా లోతైన మార్కె్ట్ క్రాష్ అని కియోసాకి అంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రావడం, గ్లోబల్ ఎకానమీలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల ఈ క్రాష్ జరుగుతుందని ఆయన అంటున్నారు.
కారణాలివే..
AI రాకతో ఉద్యోగాలు పోవడం దీనికి ఒక కారణం అని కియోసాకి చెప్తున్నారు. ఏఐతో ఉద్యోగాలు పోయినప్పుడు.. ఆఫీసు, రియల్ ఎస్టేట్ విలువలు కూడా కుప్పకూలుతాయి అని ఆయన హెచ్చరించారు. 2013లో ఆయన రాసిన RICH DAD's PROPHECY లో ఈ సంక్షోభం వస్తుందని అంచనా వేసినట్టు కూడా ఆయన గుర్తు చేశారు. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాదని, యూరప్, ఆసియా కూడా పతనమవుతున్నాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు.

మీ డబ్బు సేఫ్ గా ఉండాలంటే..
ఈ సంక్షోభం సమయంలో పెట్టుబడిదారులు వెంటనే తమ డబ్బును సురక్షితమైన ఆస్తుల వైపుకి మళ్లించాలని కియోసాకి సూచిస్తున్నారు. ఆయన దృష్టిలో ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆస్తులు ఇవే..
- బంగారం (Gold)
- వెండి (Silver)
- బిట్‌కాయిన్ (Bitcoin)
- ఎథీరియం (Ethereum)
వెండి బెటర్
కియోసాకి ప్రత్యేకంగా వెండి గురించి ప్రస్తావిస్తూ.. "వెండి చాలా ఉత్తమమైనది, సురక్షితమైనది" అని చెప్పారు. ఇప్పుడు వెండి ధర కిలోకి 50 డాలర్లు ఉంది. త్వరలోనే అది 70 డాలర్లకు చేరుకుంటుందని, 2026లో ఏకంగా 200 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నేను ఆయన అంచనా వేస్తున్నారు.
సంక్షోభం = గొప్ప అవకాశం!
సంక్షోభం వచ్చినప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, సంక్షోభం అనేది సిద్ధంగా ఉన్నవారికి గొప్ప అవకాశాలను సృష్టిస్తుందని కియోసాకి భరోసా ఇచ్చారు. "లక్షలాది మంది తమ సర్వస్వం కోల్పోవచ్చు... కానీ, మీరు సిద్ధంగా ఉంటే ఈ పతనం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు. తాను కూడా ఈ పతనం వస్తుందని తెలిసినా అమ్మడం కంటే కొనడానికే మొగ్గు చూపుతానని తెలిపారు. 2026 నాటికి బంగారం 27,000 డాలర్లకు, బిట్‌కాయిన్ 2,50,000 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన గతంలో అంచనా వేశారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
కియోసాకి మాటల్లోని సారాంశం ఒక్కటే. కరెన్సీ విలువ తగ్గినప్పుడు.. కొరత ఉన్న ఆస్తులు అంటే బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటివి మాత్రమే మెరుగైన ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక విపత్తులు వస్తూనే ఉంటాయి, కానీ సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశాన్ని ఇస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు.
More From GoodReturns

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications