బంగారం, వెండి ధరలు ఆకాశానికి.. మధ్యలో మాత్రం పాతాళానికి.. రాబర్ట్ కియోసాకి షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి పెట్టుబడులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దిగ్గజ కమోడిటీస్ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ విశ్లేషణను కియోసాకి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈ రెండు విలువైన లోహాల ధరలు ఊహించని రీతిలో భారీగా పెరిగి ఆకాశాన్ని తాకుతాయని తెలిపారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకే సరళరేఖలో పైకి వెళ్లదని.. మధ్యమధ్యలో వచ్చే తీవ్రమైన వెనుకంజలు, పతనాలు లేదా అధిక అస్థిరత వంటివి మార్కెట్ యొక్క సహజ లక్షణాలని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల బంగారం తన గరిష్ట స్థాయి ఔన్సుకు 5,405 డాలర్ల నుండి 26 శాతం పడిపోయి 4,006 డాలర్ల వైపుకు చేరగా.. వెండి మరింత తీవ్రమైన కరెక్షన్‌ను ఎదుర్కొంటూ 118 డాలర్ల గరిష్ట స్థాయి నుండి సగానికి పైగా క్షీణించి 56 డాలర్ల సమీపానికి చేరింది. కియోసాకి ఈ ధరల తగ్గుదలను ఒక ప్రతికూల అంశంగా చూడకుండా.. మరింత ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా మార్చుకున్నట్లు Robert kiyosaki వెల్లడించారు.

Robert Kiyosaki Jim Rogers Gold Price Prediction Silver Price Prediction Gold Investment Silver Investment Precious Metals Bullion Market Gold Forecast Silver Forecast Gold News Business News

చాలా మంది సాధారణ స్పెక్యులేటర్లు మార్కెట్ ఊపులో ఉన్నప్పుడు ఆశతో కొని.. ధరలు కనిష్ట స్థాయికి పడిపోగానే భయంతో నష్టాలకు విక్రయిస్తుంటారని, కానీ నిజమైన సంపద సృష్టి అనేది ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ద్వారానే సాధ్యమవుతుందని కియోసాకి వివరించారు. ఆయన బంగారం, వెండిపై ఇంతటి నమ్మకాన్ని ఉంచడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఆందోళనే.

Also Read

బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మూసివేత భయాలు, అమెరికా-ఇరాన్ సైనిక ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ గందరగోళం మధ్యప్రాచ్యాన్ని కుదిపేస్తున్న తరుణంలో.. ఈ అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులను, నిరంతరం పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు, ద్రవ్యోల్బణ సమస్యలను పరిష్కరించడంలో నాయకులు లేదా కేంద్ర బ్యాంకులు విఫలమయ్యారని ఆయన నమ్ముతున్నారు. ఈ కృత్రిమ ఆర్థిక వ్యవస్థలో ఫియట్ కరెన్సీల విలువ పడిపోతుందని.. అందువల్ల నిజమైన అంతర్గత విలువ కలిగిన బంగారం, వెండి మాత్రమే దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల సంపదను కాపాడగలవని ఆయన వాదన.

రాబర్ట్ కియోసాకి గతంలో సోషల్ మీడియా ద్వారా 2026 నాటికి Gold 27 వేల డాలర్లకు కు, వెండి 100 డాలర్లకు చేరుకుంటుందని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. ఇందులో వెండి 100 డాలర్ల మార్కును తాకడం అతని అంచనాలకు కొంత విశ్వసనీయతను ఇచ్చింది. అయితే భవిష్యత్తులో బంగారం 35 వేల డాలర్లకు, వెండి 200 డాలర్లకు చేరుకుంటుందనే అతని మరికొన్ని అంచనాలు కేవలం వ్యక్తిగత సెంటిమెంట్ ఆధారితమైనవే కానీ అధికారిక వాల్యుయేషన్ నమూనాలు కావని చెప్పవచ్చు.

విమర్శకుల ప్రకారం.. ప్రస్తుత 4 వేల డాలర్ల స్థాయిల నుండి Gold 7 నుండి 9 రెట్లు పెరగాలంటే మార్కెట్లు ప్రస్తుతం అంచనా వేస్తున్న దానికంటే చాలా తీవ్రమైన వ్యవస్థాగత ఆర్థిక సంక్షోభం సంభవించాల్సి ఉంటుంది. అయినప్పటికీ గత రెండేళ్లుగా ఈ రెండు లోహాలు అసాధారణమైన రాబడులను అందించాయన్నది వాస్తవం. 2025 ప్రారంభం నుండి బంగారం విలువ రెట్టింపు కాగా.. వెండి విలువ దాదాపు మూడింతలు పెరిగింది.

మరోవైపు కడ్డీలు, నాణేలను భౌతికంగా నిల్వ చేసే లాజిస్టికల్ ఇబ్బందులు లేకుండా లోహాలలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లు (ETFs) అనువైన సాధనంగా మారాయి. భౌతిక బంగారు మద్దతు ఉన్న SPDR గోల్డ్ షేర్స్ (GLD - 0.40% వ్యయ నిష్పత్తి), వెండి కొరకు abrdn ఫిజికల్ సిల్వర్ షేర్స్ ETF (SIVR - 0.30% వ్యయ నిష్పత్తి) స్పాట్ ధరలతో ప్రత్యక్ష సంబంధాన్ని అందిస్తాయి.

గత 10 సంవత్సరాల కాలంలో SIVR 12 శాతం రాబడిని ఇవ్వగా.. GLD 11.4 శాతం రాబడిని ఇచ్చింది. సౌర ఫలకాల తయారీ వంటి పునరుత్పాదక ఇంధన రంగాల నుండి పారిశ్రామికంగా విపరీతమైన డిమాండ్ ఉండటం వల్లే వెండి కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఏదేమైనప్పటికీ.. ఇవి కియోసాకి యొక్క వ్యక్తిగత పెట్టుబడి వ్యూహాలు, విశ్లేషణలు మాత్రమేనని, మార్కెట్ అస్థిరతలను తట్టుకునేందుకు ఇన్వెస్టర్లు తమ సొంత ఆర్థిక విశ్లేషణతో ముందడుగు వేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+