ప్రముఖ పారిశ్రామిక సంస్థ 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్' మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను దక్కించుకుంది . మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ శుక్రవారం లద్దాఖ్ వద్ద జోజిలా పాస్ టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టుకు అతి తక్కువ బిడ్డర్‌గా నిలిచిన మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఈ నిర్మాణ పనులను అప్పజెప్పనున్నారు .

జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్య రహదారి నిర్మాణమే లక్ష్యం
జోజిలా టన్నెల్ జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్య ఏడాది పొడవునా అనుసంధానం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన సైన్యం మూవ్ మెంట్ ఈజీగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం .ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, 4,509 కోట్లు. సుమారు 33 కిలోమీటర్ల రెండు విభాగాలలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 2018 లో, జమ్మూ కాశ్మీర్‌లో ఆసియా యొక్క పొడవైన రెండు దిశలను సూచించే సొరంగంగా ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు .

గతంలో నిలిచిపోయిన ప్రాజెక్ట్ .. తాజా టెండర్ లలో మేఘా చేతికి
అయితే ఈ ప్రాజెక్టు కొంతకాలంగా నిలిచిపోయింది. అంతకు ముందు దీనిని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) చుట్టూ ఉన్న ఆర్థిక సంక్షోభం తరువాత ప్రభుత్వం 2019 జనవరిలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌తో మునుపటి ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత జూన్‌లో జోజిల్లా సొరంగం కోసం 14.15 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం తాజా టెండర్‌ను ఆహ్వానించింది.

రెండు విభాగాలుగా నిర్మాణ పనులు .. గుర్రపు డెక్క ఆకారంలో టన్నెల్ మార్గాలు
మొత్తం పనిని రెండు విభాగాలుగా చెప్పతాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో 18.50 కిలోమీటర్ల రహదారిని నిర్మించడం ద్వారా రోడ్ల అభివృద్ధి చేయడంతో పాటు , రెండవ విభాగంలో, జోజిల్లా టన్నెల్‌ను 9.15 మీటర్ల వెడల్పు మరియు 7.57 మీటర్ల ఎత్తు గల రెండు-రహదారి మార్గాలుగా 14.15 కిలోమీటర్ల గుర్రపు డెక్క ఆకారంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కట్టటం అంత సులభం కాదు . అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో వినూత్నంగా నిర్వహించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి సొరంగం పూర్తి చేయడానికి భారత ప్రభుత్వం చివరకు టెండర్లకు పిలుపునిచ్చింది.

చాలెంజింగ్ గా ప్రాజెక్ట్ ... నిర్మాణంలో అడుగడుగునా ఆటంకాలే ఉంటాయంటున్న సంస్థ
మెయిల్ ఎల్ -1 గా మారిన ఈ ప్రాజెక్ట్, జోజిల్లా పాస్ ఏరియాలో జాతీయ రహదారి -1 లో సోనమార్గ్-కార్గిల్ మధ్య జెడ్-మోర్ టన్నెల్ నుండి జోజిల్లా టన్నెల్ వరకు నిర్మిస్తుంది. ఈ ఇపిసి ప్రాజెక్ట్ చాలా క్లిష్టమైనది. ఈ సొరంగం నిర్మాణం చాలా ఇబ్బందికరం అయినా సరే నిర్మించి తీరుతామని కంపెనీ తెలిపింది, కొండ భాగం మరియు తరచుగా మంచు తుఫానుల కారణంగా ఈ సొరంగం నిర్మాణ పనులు సవాలుగా మారుతాయని చెప్పారు.సంవత్సరంలో కనీసం ఎనిమిది నెలలు దట్టమైన మంచు ఉన్నందున, అమలు పనులు అంత సులభం కాదని చెప్తోంది . అదే సమయంలో, ప్రతిపాదిత ప్రాజెక్ట్ సైట్ ప్రక్కనే ఒక నది ప్రవహిస్తుందని , దానితో కూడా ఇబ్బంది ఉందని పేర్కొంది. అయినా సరే ఈ ప్రాజెక్టును ఆరేళ్లలో పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications