GST Hike: ఇప్పటికే పెరిగిన ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలతో సతమతమౌతున్న క్రమంలో మరో సంచలనానికి కేంద్రం తెరతీయనుంది. వాహనదారులపై జీఎస్టీ భారాన్ని పెంచేందుకు పెద్ద ప్లాన్ జరుగుతోంది.
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 12న మాట్లాడుతూ డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలను నిరుత్సాహపరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను లేఖ ద్వారా కోరారు.

డీజిల్ వాహనాలను విక్రయించటం కష్టతరంగా మార్చేందుకు అదనపు పన్నులు వేయాలని నిర్మలమ్మకు నితిన్ గడ్కరీ సూచించారు. దీనిపై ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రిని సాయంత్రం కలుస్తున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల డీజిల్ వాహనాలను విక్రయించడం కంపెనీలకు కష్టంగా మారుతుందని మంత్రి ఆటోమొబైల్ కంపెనీలను హెచ్చరించారు. డీజిల్ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని.. లేకుంటే తాను పన్నులను పెంచుతాను అని గడ్కరీ అన్నారు.
జీవ ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెరుగుతున్న దృష్టిని కూడా మంత్రి నొక్కిచెప్పారు. G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశం గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో చేరినందున మార్పు అనివార్యంగా తెలుస్తోంది. అలాగే చమురు దిగుమతి ఖర్చులను తగ్గించి.. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించటానికి తాజా చర్యలు దోహదపడనున్నాయని తెలుస్తోంది. ఇథనాల్ ఆధారిత బస్సులు, ట్రక్కులను ఎందుకు నడపకూడదంటూ టో పరిశ్రమను నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఈ వార్తల నేపథ్యంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్వరాజ్ ఇంజిన్స్, అశోక్ లేలాండ్ కంపెనీల షేర్లు మార్కెట్లో నష్టాపోయాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications