IPO News: తొలిరోజే చౌక ఐపీవో లాభాల సునామీ.. బెట్టింగ్ వేసినవాళ్లకు 90% బంపర్ లాభం..

RNFI Services IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న బుల్ జోరుకు తోడు ఐపీవోల లాభాలు ఇన్వెస్టర్లను సంతోషంలోకి నెట్టేస్తున్నాయి. ఈవారం దాదాపు 11 ఐపీవోలు బెట్టింగ్ వేసేందుకు సిద్ధంగా ఉండగా.. నేడు లిస్టింగ్ అయిన ఐపీవో ప్రీమియం రాబడులను అందించింది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీసెస్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు 90 శాతం ప్రీమియంతో నేడు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ ఐపీవో ఏకంగా రూ.199.50 రేటు వద్ద లిస్టింగ్ చేయబడింది. గ్రేమార్కెట్లో ప్రీమియం ధరకు అనుగుణంగా బలమైన అరంగేట్రం జరపటంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో వాస్తవ గరిష్ఠి ప్రైస్ బ్యాండ్ ఇష్యూ ధరను గమనిస్తే రూ.105గా ఉంది.

RNFI Services IPO made bumper listing with 90 premium rate listing Investors Happy

RNFI సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ఇష్యూ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జూలై 22న ప్రారంభమై జూలై 24 బెట్టింగ్ వేసేందుకు అందుబాటులో ఉంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు పేలుబు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో షేర్లు ప్రాఫిట్ బుకింగ్‌ వల్ల 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకాయి. ఈ క్రమంలో కొద్దిసేపటికే షేర్ ధర తగ్గి రూ.189.55 వద్దకు పడిపోయింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.70.81 కోట్లను మార్కెట్ల నుంచి విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించగా ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనేందుకు కనీసం రూ.1,26,000 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.

కంపెనీ ఐపీవో 221.49 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. రిటైల్ విభాగం 142.62 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత విభాగంలో 140.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఈ క్రమంలో పెద్ద యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.20.03 కోట్లను సమీకరించింది. 2015లో స్థాపించబడిన కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాపారంలో ఉంది. భారతదేశం అంతటా బ్యాంకింగ్, డిజిటల్ అండ్ గవర్నమెంట్-టు-సిటిజన్ (G2C) సేవలను అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో బిజినెస్ కరస్పాండెంట్ సేవలు, వ్యాపారేత్తర కరస్పాండెంట్ సేవలు, పూర్తి స్థాయి కరెన్సీ కన్వర్షన్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ వ్యాపారంలో ప్రస్తుతం కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+