RK Swamy IPO: చాలా మంది ఐపీవోలపై బెట్టింగ్ వేసి భారీగా సంపాదించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు ప్రారంభమైన ఐపీవోపై చాలా మంది దృష్టి ఉంది. గ్రేమార్కెట్లో అదరగొడుతున్న ఐపీవో లిస్టింగ్ సమయంలో సూపర్ లాభాలను అందించటానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఐపీవోపై బెట్టింగ్ చేసే పెట్టుబడిదారులకు ఆర్కే స్వామి ఐపీవో నేడు సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. నేడు ప్రారంభమైన ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.423.56 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు సానుకూల స్పందన కలిగి ఉన్నారు. కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.270-రూ.288గా నిర్ణయించింది.

ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 50 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్ కొనుగోలు చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు రూ.14,400 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. కంపెనీ తన ఉద్యోగులకు ఒక్కో షేరును రూ.27 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. మార్చి 1న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం IPO ప్రారంభించబడింది. అప్పుడు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.187.23 కోట్లు సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల 50 శాతం షేర్ల లాక్-ఇన్ పీరియడ్ ఏప్రిల్ 6, 2024గా ఉంది.
కంపెనీ షేర్లు గ్రేమార్కెట్లో రూ.90 ప్రీమియం రేటుకు ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ లెక్కన లిస్టింగ్ రోజున కంపెనీ ఒక్కో షేరు మార్కెట్లో రూ.378 రేటు వద్ద జాబితా అయ్యేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే IPO మొదటి రోజునే అర్హత షేర్లను పొందిన పెట్టుబడిదారులకు 31 శాతం లాభాన్ని ఇస్తుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 83.03 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ తాజా ఐపీవోలో 60 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా.. మిగిన 97 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications