Oyo: ఈ మధ్యకాలంలో ఓయో రూమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో హోటళ్లు, రెస్టారెంట్ల రేట్ల గురించి అంత అవగాహన ఉండేది కాదు. కానీ ఓయో రూమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా సమాచారాన్ని ఆన్ లైన్ లోనికి తీసుకొచ్చింది. తద్వారా అనుకున్నంత ఖర్చులో, ఇష్టమైన చోట, నచ్చిన రూమ్ ఎంచుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఈ కంపెనీ వ్యవస్థాపకుడి ఇంటి నుంచి ఒక దుర్వార్త వెలువడింది.

తీరని లోటు:
దురదృష్టవశాత్తు తన తండ్రి రమేష్ అగర్వాల్ మరణించినట్లు ఓయో రూమ్స్ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ ప్రకటించారు. తాను నివాసం ఉంటున్న 20వ అంతస్తు నుంచి జారిపడి మృతి చెందినట్లు వెల్లడించారు. తమ జీవితాలకు ఓ గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయిన బాధలో ఉన్నట్లు తెలిపారు. తమలో ఎంతో స్ఫూర్తిని నింపిన ఆయన మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటు అని, ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని విఙప్తి చేశారు.

ఆసుపత్రికి తరలించినా..
ఈ ఘటనపై శుక్రవారంమధ్యాహ్నం 1 గంటకు సమాచారం అందినట్లు గురుగ్రాం ఈస్ట్ DCP వీరేంద్ర విజ్ వెల్లడించారు. 'DLF ది క్రెస్ట్' సొసైటీలోని 20వ అంతస్తు నుంచి ఓ వ్యక్తి పడిపోయినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారన్నారు. చికిత్స కోసం పరాస్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వెంటనే సెక్టార్ 53 నుంచి SHOతో కూడిన ఓ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామన్నారు. ఆ పడిపోయిన వ్యక్తిని రమేష్ ప్రసాద్ అగర్వాల్ గా గుర్తించినట్లు ప్రకటించారు.

నో సూసైడ్ నోట్:
రమేష్ మృతి చెందిన సమయంలో ఆయన భార్య, రితేష్ అగర్వాల్ దంపతులు అదే అపార్ట్ మెంట్లో ఉన్నట్లు వీరేంద్ర తెలిపారు. అక్కడ నుంచి ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. కుటుంబ సభ్యుల నుంచి సైతం ఫిర్యాదేమీ అందలేదని వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అందజేసినట్లు చెప్పారు. తన కుమారుడితో కాకుండా రమేష్ వేరుగా నివసిస్తున్నారు. 29 ఏళ్ల రితేష్ వివాహం సైతం ఇటీవలే జరిగింది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications