Ritesh Agarwal: 17 ఏళ్లకే వ్యాపారం.. 31 సంవత్సరాలకే బిలియనీర్.. ఎవరీ రితేష్ అగర్వాల్..
17 ఏళ్ల వయస్సులో పిల్లలు ఏం చేస్తారు కాలేజీల్లో చదువుతుంటారు. కానీ ఓ పిల్లాడు మాత్రం దేశమంతా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో చాలా పర్యటక ప్రాంతాల్లో హోటల్ గదులు ఖరీదైనవిగా అతడికి అనిపించింది. అసౌకర్య బెడ్‌లు, నమ్మదగని సేవలు, అస్థిరమైన ప్రమాణాలు అతన్ని ఇబ్బంది పెట్టాయి. దీంతో అతను సొంతంగా హోటల్ ప్రారంభించాలనుకున్నాడు. పీర్-టు-పీర్ మోడల్ నుండి ప్రేరణ పొందన అతను 2011లో ఒరావెల్ ట్రావెల్స్‌ను ప్రారంభించాడు.
అతను ఎవరో కాదు ఓయో అధినేత రితేష్ అగర్వాల్(Ritesh Agarwal). రితేష్ 2013లో ఓయో రూమ్స్ ప్రారంభించాడు. అప్పుడు ఓయోకు సొంతంగా హోటళ్లు లేదు. దీంతో వివిధ హోటళ్ల యజమానులతో భాగస్వామ్యంతో వ్యాపారాన్ని విస్తరించాడు. తన టెక్-అవగాహన ఉన్న మనస్సును ఉపయోగించి, రితేష్ అధునాతన ఆదాయ నిర్వహణ వ్యవస్థను, కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేశాడు. ప్రతి OYO గది క్లీన్ లినెన్, Wi-Fi, బ్రాండెడ్ టాయిలెట్‌లు ఉండేలా చర్యలు తీసుకున్నాడు.

సరసమైన ధరల్లో ఓయో రూములను అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఓయో ప్రయాణం ఎటువంటి అవాంతరాలు లేకుండా లేదు. ప్రారంభ కష్ణాలు,తీవ్రమైన పోటీ అడ్డంకులు తెచ్చాయి. అయినప్పటికీ రితేష్ పట్టు వదలని విక్రమార్కుడిలా వ్యవహరించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాడు.అతను పలువురు పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను కూడా సేరించాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించాడు. వెకేషన్ రెంటల్స్, కో-లివింగ్ స్పేస్‌లలోకి వైవిధ్యభరితంగా వ్యవహరించాడు.
ప్రస్తుతం ఓయో వ్యాపారం ప్రపంచవ్యాప్త ఉంది. రితేష్ అగర్వాల్ కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచింది. అచంచలమైన సంకల్పం, కస్టమర్ అవసరాలపై లోతైన అవగాహనతో కూడిన సాధారణ ఆలోచన శక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది. కేవలం 31 ఏళ్లకే రితేష్ అసాధ్యమని భావించే దానిని సాధించాడు. కానీ అతని ప్రయాణం ఇంకా చాలా దూరంగా ఉంది. మరోవైపు ఓయో ఐపీఓ త్వరలో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications